IPL 2022: ఐపీఎల్-2022 మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26న కోల్‌కతా నైట్‌రైడర్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఈ లీగ్ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. నెట్స్‌లో బ్యాటర్లు, బౌలర్లు చెమటోడుస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యున్నత కెప్టెన్‌గా పేరు సంపాదించిన ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. రెండు జట్ల సారథులకు సంబంధించిన వీడియోలు ఆయా ఫ్రాంచైజీలు సోషల్‌మీడియాలో పోస్టు చేశాయి. తమ అభిమాన క్రికెటర్ల కళ్లు చెదిరే షాట్లు చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే దూకుడును టోర్నీలోనూ కొనసాగించాలని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడబోతున్న టీమ్ఇండియా బ్యాటర్.. అజింక్య రహానే కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న ప్రారంభమై.. మే 29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈసారి లఖ్‌నవూ, గుజరాత్ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడుతున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.
ఈ సీజన్లో మొత్తం 12 డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు జరుగుతుండగా దిల్లీ, ముంబయి మధ్య తొలి డబుల్ హెడ్డర్ జరగనుంది. రాత్రి మ్యాచ్‌లు.. 7.30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు 3.30 గంటలకు మొదలవుతాయి. 65 రోజుల పాటు సాగే సీజన్లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌లో చివరి మ్యాచ్ వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది.
ఇదీ చదవండి: IPL 2022: విధ్వంస వీరులు.. తక్కువ బంతుల్లో అర్ధశతకాలు!