ETV Bharat / sports

డుప్లెసిస్ విధ్వంసం.. డీకే ధనాధన్​​​​​.. పంజాబ్​ లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Mar 27, 2022, 9:17 PM IST

Updated : Mar 27, 2022, 9:39 PM IST

IPL 2022 RCB VS PBKS: ఐపీఎల్​ 15వ సీజన్​లో భాగంగా పంజాబ్​తో మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​​ జట్టు బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థి జట్టు ముందు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. డుప్లెసిస్​(88) ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడాడు. ఆఖర్లో డీకే దంచికొట్టాడు.

bangalore captain
ipl 2022

IPL 2022 RCB VS PBKS: ఐపీఎల్​ 2022లో భాగంగా డీవై పాటిల్​​ వేదికగా పంజాబ్​ జట్టుతో జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరు జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేశారు. పంజాబ్ జట్టుకు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆర్సీబీ కెప్టెన్​ డుప్లెసిస్​(88) మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో దుమ్మురేపగా.. మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(41*) తనవంతుగా మంచి ఇన్నింగ్స్​ ఆడాడు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు జట్టు ఓపెనర్లు డుప్లెసిస్​, అనుజ్​ రావత్​ శుభారంభం చేశారు. 21 పరుగులు చేసిన అనుజ్‌ రావత్‌.. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక, కొత్త కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సమయంలో క్రీజులోకి మాజీ సారథి విరాట్​ కోహ్లీ వచ్చాడు. అతడు కూడా తనదైన ఇన్నింగ్స్‌ ఆడడం వల్ల స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 88 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన డుప్లెసిస్‌.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో షారుక్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌.. విధ్వంసాన్ని కొనసాగించాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 14 బంతుల్లోనే 32 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. పంజాబ్​ బౌలర్లలో రాహుల్​ చాహర్​, అర్షదీప్​ సింగ్​ తలో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్‌లో 200 ప్లస్‌ స్కోరు సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

ఇదీ చదవండి: IPL 2022: ముంబయిపై ఘనవిజయం సాధించిన దిల్లీ

Last Updated : Mar 27, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.