IPL 2022 PBKS Vs CSK: ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై మరోసారి బోల్తా పడింది. ఆఖరి వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 187/4 స్కోరు చేసింది. అనంతరం చెన్నై ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో 27 పరుగులు కావాల్సిన తరుణంలో ఎంఎస్ ధోనీ (12) తొలి బంతికే సిక్స్ కొట్టి ఊపు తెచ్చాడు. అయితే తర్వాతి రెండు బంతులకు ఒకటే పరుగు రావడం.. నాలుగో బంతికి ధోనీ ఔట్ కావడంతో చెన్నై ఆశలు గల్లంతయ్యాయి. ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చినా అవి చెన్నై విజయానికి సరిపోలేదు. చెన్నై బ్యాటర్ అంబటి రాయుడు (78) పోరాడాడు. రుతురాజ్ గైక్వాడ్ 30, రవీంద్ర జడేజా 20* పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రిషి ధావన్ 2, కగిసో రబాడ 2.. సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పంజాబ్ (8) పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. చెన్నైకిది ఆరో ఓటమి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఎదుట 188 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. బ్యాటర్ శిఖర్ ధావన్ (88*) సూపర్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు నమోదు చేసింది. ధావన్ కాకుండా మయాంక్ అగర్వాల్ (18), భానుక రాజపక్స (42), లియామ్ లివింగ్ స్టోన్ (19), జానీ బెయిర్‌స్టో (6) పరుగులు చేశారు. చెన్నై ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం పంజాబ్‌కు కలిసొచ్చింది. చెన్నై బౌలర్లలో బ్రావో 2, తీక్షణ ఒక వికెట్ తీశారు.
ఇవీ చదవండి: ఐపీఎల్లో గబ్బర్ రికార్డు.. కోహ్లీ తర్వాత అతడే