ETV Bharat / sports

IPL 2022 Mega Auction: హర్షల్​ పటేల్​ రికార్డు.. రైనాకు షాక్​ - ఐపీఎల్​ 2022 మెగా వేలం సురేష్​ రైనా

IPL 2022 Mega Auction Harshal Patel: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్​ మెగావేలం రెండో సెట్​లో హర్షల్​ పటేల్​ రికార్డు సృష్టించాడు. అతడిని రూ.10.75కోట్లు వెచ్చించి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు సొంతం చేసుకుంది. కాగా, సురేశ్​​ రైనా సహా పలువురు కీలక ఆటగాళ్లపై తొలి రౌండ్లో ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

harshal patel
హర్షల్​ పటేల్​
author img

By

Published : Feb 12, 2022, 3:59 PM IST

IPL 2022 Mega Auction Harshal Patel: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌-2022 మెగా వేలంలో హర్షల్​ పటేల్​ రికార్డు సృష్టించాడు. గత సీజన్​లో రూ.20లక్షలకు అమ్ముడుపోయిన అతడిని ఈ సారి రూ.10.75 కోట్లు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. కాగా, గతేడాది అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్ అందుకున్నాడతడు.

గతేడాది ఆర్సీబీకే ఆడిన హసరంగను రూ. 10.75 కోట్లు వెచ్చించి తీసుకుంది అదే జట్టు.

మొత్తంగా లంచ్‌ బ్రేక్‌ సమయానికి రెండో సెట్​లో 14 మంది వేలం పూర్తయ్యింది. విండీస్ ఆల్‌ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లకు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. షిమ్రోన్‌ హెట్‌ మయర్‌పై రూ.8.50 కోట్లు, యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌పై రూ.7.75 కోట్లు వెచ్చించి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సొంతం చేసుకుంది. కాగా.. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ మిల్లర్‌, సురేశ్ రైనా, షకీబ్‌ అల్ హసన్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

రెండో సెట్లో కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు..

1. మనీశ్‌ పాండే రూ. 4.60 కోట్లు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌
2. షిమ్రోన్‌ హిట్‌మయర్ రూ. 8.50 కోట్లు రాజస్థాన్‌ రాయల్స్‌
3. రాబిన్‌ ఉతప్ప రూ.2 కోట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌
4. జేసన్‌ రాయ్‌ రూ. 2 కోట్లు గుజరాత్ టైటాన్స్‌
5. దేవ్‌దత్‌ పడిక్కల్‌ రూ.7.75 కోట్లు రాజస్థాన్‌ రాయల్స్‌
6. డ్వేన్‌ బ్రావో రూ.4.40 కోట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌
7. నితీశ్‌ రాణా రూ.8 కోట్లు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
8. జేసన్‌ హోల్డర్‌ రూ.8.75 కోట్లు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌
9. హర్షల్‌ పటేల్‌ రూ.10.75 కోట్లు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
10. దీపక్‌ హుడా రూ.5.75 కోట్లు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

11. వనిందు హసరంగ- 10.75 కోట్లు- రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

ఈ సెట్లో అమ్ముడుపోని ఆటగాళ్లు..
1. సురేశ్ రైనా
2. స్టీవ్‌ స్మిత్‌
3. డేవిడ్ మిల్లర్‌
4. షకీబ్‌ అల్ హసన్‌

శ్రేయస్​కు అత్యంత ధర..

ఐపీఎల్‌-2022 మెగా వేలం తొలిసెట్​లో మొత్తం పది మంది బరిలోకి రాగా శ్రేయస్‌ అయ్యర్‌ అత్యధిక ధర పలికాడు. గతేడాది వరకు దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కొనసాగిన అతడు ఈసారి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లోకి వెళ్లాడు. అతడి కోసం కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ పోటీపడింది. అయితే, చివరకు కోల్‌కతా రూ.12.25 కోట్లకు సొంతం చేసుకుంది. గతేడాది దిల్లీ జట్టు తరఫున శ్రేయస్‌ రూ.7 కోట్లు తీసుకున్నాడు. మరోవైపు తొలిసెట్‌లో భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, డేవిడ్‌ వార్నర్‌ తక్కువ ధర పలికారు. అశ్విన్‌ ఇదివరకు దిల్లీ తరఫున రూ.7.60 కోట్లు ఖాతాలో వేసుకోగా ఈసారి రాజస్థాన్‌ రూ.5కోట్లకే కొనుగోలు చేసింది. మరోవైపు సన్‌రైజర్స్‌ మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ సైతం ఈ మెగా వేలంలో తక్కువ ధరనే పలికాడు. అతడిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంటుందని అనుకున్నా చివరికి దిల్లీ క్యాపిటల్స్‌ రూ.6.25 కోట్లకే దక్కించుకుంది. గతేడాది వరకు అతడు రూ.11 కోట్లు తీసుకున్నాడు.

తొలి సెట్‌ ఆటగాళ్లు ఎవరెవరు.. ఏయే జట్టుకు

* శిఖర్‌ ధావన్‌ రూ.8.25 కోట్లు (పంజాబ్‌)
* అశ్విన్‌ రూ.5 కోట్లు (రాజస్థాన్‌)
* కమిన్స్‌ రూ.7.25 కోట్లు (కోల్‌కతా‌)
* రబాడ రూ.9.25 కోట్లు (పంజాబ్‌‌)
* ట్రెంట్‌ బౌల్ట్‌ రూ.8 కోట్లు (రాజస్థాన్‌‌)
* శ్రేయస్‌ అయ్యర్‌ రూ.12.25 కోట్లు (కోల్‌కతా)
* మహ్మద్‌ షమి రూ.6.25 కోట్లు (గుజరాత్‌)
* ఫా డుప్లెసిస్‌ రూ.7 కోట్లు (బెంగళూరు)
* క్వింటన్‌ డికాక్‌ రూ.6.75 కోట్లు (లఖ్‌నవూ)
* డేవిడ్‌ వార్నర్‌ రూ.6.25 కోట్లు (దిల్లీ)
* మనీశ్‌ పాండే రూ.4.6 కోట్లు (లఖ్‌నవూ)

ఇదీ చూడండి: IPL 2022 Mega auction: స్టేజిపైనే కుప్పకూలిన ఐపీఎల్​ ఆక్షనీర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.