IPL 2022 LSG vs CSK: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 15వ సీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
211 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన లఖ్‌నవూ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ శుభారంభం చేశారు. వీరిద్దిరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ రాహుల్(40)..ప్రీటోరియస్ బౌలింగ్‌లో అంబటి రాయుడి చేతికి చిక్కి పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే ఐదు పరుగులకే వెనుదిరిగాడు. మెరుగ్గా రాణిస్తున్న ఓపెనర్ క్వింటన్ డికాక్(61)ను సైతం ప్రీటోరియస్ ఔట్ చేశారు. ఎవిన్ లూయిస్ (55*) , ఆయుష్ బదోని(19*) మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ముగించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రీటోరియస్ 2, తుషార్ దేశ్ పాండే, బ్రావో చెరో వికెట్ తీశారు.
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నాలుగు పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప పరుగుల వరద పారించాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సుతో 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చి మొయిన్ అలీ(22 బంతుల్లో 35) సైతం ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. శివమ్ దుబె(30 బంతుల్లో 49), అంబయి రాయుడు(27), రవీంద్ర జడేజా(17), ఆఖర్లో ధోనీ(16) రాణించడం వల్ల.. చెన్నై భారీ స్కోరు సాధించింది. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు 79 పరుగులు పిండుకుంది. మొత్తం 7 వికెట్లు కోల్పోయింది.
ఇదీ చదవండి: 'ఫుట్‌బాల్‌కు రొనాల్డో.. క్రికెట్‌కు విరాట్ కోహ్లీ'