ETV Bharat / sports

IPL 2022: ఊతప్ప, దుబె మెరుపులు.. లఖ్​నవూ ముందు భారీ లక్ష్యం - IPL 2022 LSG vs CSK

IPL 2022 LSG vs CSK: చెన్నై బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. లఖ్​నవూ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. చెన్నై జట్టు బ్యాటర్లు రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, శివమ్ దుబె మెరుపులు మెరిపించారు.

IPL 2022 LSG vs CSK
IPL 2022 LSG vs CSK
author img

By

Published : Mar 31, 2022, 9:21 PM IST

Updated : Mar 31, 2022, 9:43 PM IST

IPL 2022 LSG vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డారు. లఖ్​నవూ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన చెన్నై.. ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నాలుగు పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప పరుగుల వరద పారించాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సుతో 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చి మొయిన్ అలీ(22 బంతుల్లో 35) సైతం ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. శివమ్ దుబె(30 బంతుల్లో 49), అంబయి రాయుడు(27), రవీంద్ర జడేజా(17), ఆఖర్లో ధోనీ(16) రాణించడం వల్ల.. చెన్నై భారీ స్కోరు సాధించింది. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు 79 పరుగులు పిండుకుంది. మొత్తం 7 వికెట్లు కోల్పోయింది.

ఇక, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లఖ్​నవూ సూపర్​జెయింట్స్.. ఏ దశలోనూ ప్రభావవంతంగా కనిపించలేదు. ఆ జట్టు ఆటగాళ్లు పలు క్యాచ్​లను వదిలేయడం, ఫీల్డింగ్ తప్పిదాలు చెన్నై బ్యాటర్లకు కలిసొచ్చింది. యువ బౌలర్ రవి బిష్ణోయ్ మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఆండ్రూ టై తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ధోనీ
మహేంద్ర సింగ్​ ధోనీ

అరుదైన క్లబ్​లోకి ధోనీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అరుదైన క్లబ్​లోకి చేరుకున్నాడు. లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోనీ 16 పరుగులు చేసి.. పొట్టి క్రికెట్‌లో 7000 పరుగుల మైలరాయిని చేరుకున్న ఐదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం ధోనీ ఖాతాలో 7001 పరుగులు ఉన్నాయి.

ఇదీ చదవండి: పొవార్ స్థానంలో లక్ష్మణ్!.. అమ్మాయిల రాత మారేనా?

Last Updated : Mar 31, 2022, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.