ETV Bharat / sports

IPL 2022: ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ సారి ప్రత్యర్థులు!

మైదానంలో ప్రత్యర్థులు.. బ్యాట్‌ పడితే దంచి కొట్టాలనే కసి.. బంతి అందితే వికెట్‌ తీయాలనే తపన.. ఆట ముగిస్తే.. అన్నీ మర్చిపోయి హగ్గులిచ్చుకునే దోస్తులు! దేశాలు వేరైనా దోస్తీ శాశ్వతం అనుకున్న ఆటగాళ్లు.. ఈ సారి ఐపీఎల్​లో మాత్రం ప్రత్యర్థులుగా బరిలోకి దిగాల్సిందే.. ఎందుకంటే వారు వేరువేరు టీంలకు సెలెక్ట్​ కావడమే కారణం. ఇంతకూ ఎవరా ఆటగాళ్లు? ఓ సారి తెలుసుకుందాం.

ipl 2022 updates
ఐపీఎల్
author img

By

Published : Feb 14, 2022, 8:38 PM IST

Updated : Feb 14, 2022, 11:03 PM IST

దేశాలు వేరైనా.. ఐపీఎల్​ ఎందరో ఆటగాళ్లను స్నేహితులుగా మార్చింది. ఒకే టీం తరపున ఆడుతూ ఒకే దేశ ఆటగాళ్ల మాదిరిగా కలిసిపోయారు. స్నేహమంటే ఇదేరా..! అనే స్థాయికి ఎదిగిపోయారు. డివిలియర్స్​- విరాట్ కోహ్లీ, పొలార్డ్​- పాండ్య బ్రదర్స్​ ఈ కోవలోకే వస్తారు. కాగా, స్వదేశీ ఆటగాళ్లైన ధోనీ-సురేష్ రైనా, కేఎల్ రాహుల్- మయాంక్ అగర్వాల్​ కూడా మంచి మిత్రులు. ఈ స్నేహితులు ఒకే టీం తరపున ఆడుతుంటే చూడాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటారు. వారిని చూడగానే ఫ్యాన్స్​లో ఉత్సాహం ఉరకలేస్తుంది. కానీ ఈ సారి సీన్​ రివర్స్​ అయింది. కొందరు వేర్వేరు టీంలకు సెలెక్ట్​ అయ్యారు. ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు. మరికొందరు రిటైర్మెంట్ కారణంగా ఆటకు దూరంగా ఉన్నారు.

డివిలియర్స్​- విరాట్ కోహ్లీ..

ఇద్దరూ బ్యాటింగ్‌ దిగ్గజాలే. అంతర్జాతీయ క్రికెట్‌లో మైదానంలో ప్రత్యర్థులు. కానీ ఐపీఎల్‌లో మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి గౌరవం. ఆటతీరు నచ్చుతుంది. ఈ ఇద్దరూ ఆర్సీబీకి మూలస్తంభాల్లా మారాక స్నేహ బంధం మరింత బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కూడా. సామాజిక మాధ్యమాల్లో రెండు కుటుంబాలు కలిసి దిగిన ఫొటోలు అప్పుడప్పుడూ షేర్‌ చేసుకుంటుంటారు. గత సీజన్​ వరకు ఆర్సీబీలోనే డివిలియర్స్- కోహ్లీ కొనసాగారు. కానీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సారి ఐపీఎల్ నేపథ్యంలో కోహ్లీ తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్నాడు. తమ బంధం ఆటకు మించిందని ట్వీట్ చేశాడు.

ipl 2022 updates
డివిలియర్స్​- విరాట్ కోహ్లీ

కేఎల్ రాహుల్- మయాంక్ అగర్వాల్​..

కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అండర్-19 ఆడినప్పటి నుంచి సన్నిహత సంబంధాలున్నాయి. ఇద్దరు కర్ణాటక నుంచి వచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్. ఐపీఎల్​లో పంజాబ్ కింగ్స్​కు బ్యాక్ బోన్​గా నిలిచారు. అవసరమైన సమయంలో బ్యాట్​తో రికార్డ్​లు సృష్టించారు. కానీ ఐపీఎల్ 2022లో స్నేహితులిద్దరిని ఒకే టీం తరపున మనం చూడలేం. ఈ సారి ప్రత్యర్థులుగా తలపడనున్నారు.

వేళానికి ముందే పంజాబ్​ కింగ్స్​ తరపున ఆడాలని లేదని రాహుల్ ప్రకటించాడు. ఈ సారి లక్నో టీం రాహుల్​ను కెప్టెన్​గా రూ.17 కోట్లకు ఎంపిక చేసుకుంది. పంజాబ్ కింగ్స్​లో మయాంక్ మరో ఆటగాడితో ఓపెనర్​గా రాణించనున్నాడు. రూ.14 కోట్లకు మయాంక్​ను రిటెయిన్ చేసుకుంది పంజాబ్ కింగ్స్​.

ipl 2022 updates
కేఎల్ రాహుల్- మయాంక్ అగర్వాల్​

ఎమ్​ఎస్​ ధోనీ- సురేష్ రైనా..

గురుశిష్యులుగా భావించే సురేష్​ రైనా ధోనీలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్​. వీరిద్దరి కెరీర్​ దాదాపుగా ఒకటేసారి మొదలైంది. ఇద్దరూ కలిసి భారత్​కు ఎన్నో విజయాలు అందించారు. 2015లో ధోనీ ఐసీసీ వరల్డ్​ కప్​ బిజీలో ఉండగా.. కూతురు పట్టింది. రైనా ద్వారా మహీకి ఈ విషయాన్ని చేరవేసింది ధోనీ భార్య సాక్షి. అయితే.. గురుశిష్యులు ఇద్దరు గత ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్​లోనూ వీరివూరు చెన్నై తరపున ఆడేవారు. తనపట్ల మహీకున్న నమ్మకాన్ని కూడా రైనా ఎన్నోసార్లు నిలబెట్టుకున్నాడు. కానీ ఈ సారి ఐపీఎల్ ఆక్షన్​లో రైనా ఎంపిక కాలేదు. రూ.2 కోట్ల ధరతో ఎంట్రీ ఇచ్చిన రైనాను ఫ్రాంచైజీలు సెలెక్ట్ చేయలేదు. దీంతో వీరి స్నేహాన్ని ఈ సారి ఐపీఎల్​లో మనం చూడలేం.

ipl 2022 updates
ఎమ్​ఎస్​ ధోనీ- సురేష్ రైనా

కృనాల్​ పాండ్యా- హార్ధిక్ పాండ్య..

కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్య మంచి స్నేహితులు. ఆటతీరులాగే ముగ్గురివి దూకుడైన మనస్తత్వాలు. బహుశా అదే స్నేహం కుదరడానికి కారణమైందేమో! ముగ్గురు ముంబయిలో ఉంటే సందడే సందడి. కలిసి పార్టీలకెళ్లడం, ఫ్యామిలీలతో కలిసి సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో పంచుకోవడం షరా మామూలే. మా ముగ్గురివి అన్నదమ్ముల అనుబంధం అంటాడు హార్దిక్‌. హార్దిక్‌ పక్కనుంటేనే నా జోష్‌ రెట్టింపవుతుంది అంటాడు పొలార్డ్‌. ముగ్గురిని కలిపింది ముంబై ఇండియన్స్‌ అని ప్రత్యేకంగా వేరే చెప్పాలా? వాళ్లకు వికెట్ల మధ్య మంచి సమన్వయం ఉంటుంది కూడా! ఇక ఒకరి ఆటను మరొకరు బాగా ఎంజాయ్‌ చేస్తారు. కానీ ఐపీఎల్ 2022​లో మొదటిసారి వివిధ టీంల నుంచి ఆడనున్నారు. కృనాల్​ను రూ. 8.25 కోట్లకు లక్నో సొంతం చేసుకోగా.. హార్ధిక్​ గుజరాత్ టీం కెప్టెన్​గా రూ.15 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. పొలార్డ్​ను ముంబయి రీటెయిన్ చేసుకుంది.

IPL 2022 NEWS
కృనాల్​ పాండ్యా- హార్ధిక్ పాండ్య..

డేవిడ్ వార్నర్- రషీద్​ ఖాన్

సన్​రైజర్స్​ హైదరాబాద్​లో డేవిడ్ వార్నర్, రషీద్​ ఖాన్​.. కో-స్టార్లుగా నిలిచేవారు. రషీద్ స్పిన్నర్​గా రాణిస్తే.. వార్నర్ 2013 నుంచి కెప్టెన్​గా వ్యవహరిచి, 2016లో టీంను ఛాంపియన్​గా నిలిపాడు. కానీ ఈసారి వార్నర్​ను రూ.6.25కి దిల్లీ క్యాపిటల్స్ ఎంపిక చేసుకోగా.. రషీద్​ను గుజరాత్ టీం రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది.

ipl 2022 updates
డేవిడ్ వార్నర్- రషీద్​ ఖాన్

ఇదీ చదవండి: IPL 2022: ఈసారి బరిలో నిలిచే తుది జట్లు ఇవేనా?

Last Updated : Feb 14, 2022, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.