ETV Bharat / sports

కెప్టెన్‌గా రాహుల్‌కి గొప్ప భవిష్యత్తు ఉంది: గౌతమ్‌ గంభీర్‌ - ఐపీఎల్ 2022

IPL 2022 KL Rahul News: కెప్టెన్‌గా కేఎల్ రాహుల్​కు గొప్ప భవిష్యత్‌ ఉందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్ కితాబిచ్చాడు. వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగు పెట్టనున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ) జట్టుకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా, గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

IPL 2022 KL Rahul News
రాహుల్‌
author img

By

Published : Feb 1, 2022, 6:29 PM IST

IPL 2022 KL Rahul News: టీమ్ఇండియా యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌పై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా అతడికి గొప్ప భవిష్యత్‌ ఉందని పేర్కొన్నాడు. కేవలం నాలుగు మ్యాచుల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ నాయకత్వ పటిమపై ఓ అంచనాకు రావడం సరికాదని అన్నాడు. వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగు పెట్టనున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ) జట్టుకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా, గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

IPl 2022
కేఎల్ రాహుల్

నిరంతర ప్రక్రియ..

Gambhir On KL Rahul: 'గెలుపోటములను సమానంగా స్వీకరించడమే నాయకుడి లక్షణం. విజయం సాధిస్తే ఉప్పొంగిపోవడం, ఓటమి ఎదురైతే కుంగిపోవడం రాహుల్‌కి తెలియదు. అతడిలోని గొప్ప లక్షణం కూడా ఇదే. కెప్టెన్సీ అనేది ఒక్క రోజులో నేర్చుకుంటే వచ్చేది కాదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతి రోజూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నించాలి. అప్పుడే అత్యుత్తమంగా రాణించగలం. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అన్ని సాధించేశామని గొప్పలు చెప్పుకోవడం కూడా సరికాదు. రాహుల్‌కి బ్యాటర్‌గానే కాకుండా, నాయకుడిగానూ గొప్ప భవిష్యత్తు ఉంది. అతడు చాలా ప్రశాంతంగా, ఆట పట్ల నిబద్ధతతో ఉంటాడు. అలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే, అతడి విషయంలో ఇంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేయడం సరికాదు. కేవలం నాలుగు మ్యాచుల ఫలితాలను బట్టి అతడి నాయకత్వ పటిమను అంచనా వేయలేం' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

పేలవ రికార్డ్​..

ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ దూరం కావడంతో.. వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఘోర పరాజయం పాలైంది. అంతకు ముందు జరిగిన రెండో టెస్టుకు వెన్ను నొప్పి కారణంగా విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. అప్పడు కూడా కేఎల్ రాహుల్‌ జట్టుని నడిపించాడు. ఈ టెస్టులో కూడా టీమ్‌ఇండియా ఓడిపోయింది. దీంతో రాహుల్‌ సారథ్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లోనూ కెప్టెన్‌గా రాహుల్‌కి పేలవ రికార్డే ఉంది. వ్యక్తిగత ప్రదర్శనపరంగా గొప్పగా రాణించినా.. సారథిగా విజయవంతం కాలేకపోయాడు. గత రెండు సీజన్లలోనూ పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయినా, ఒక్కసారి కూడా తన జట్టుని ప్లే ఆఫ్స్‌ చేర్చలేకపోయాడు. రాహుల్‌ ప్రస్తుతం వన్డే, టీ20 ఫార్మాట్లకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: IPL 2022: ఐపీఎల్ మెగా వేలం.. తుది జాబితా ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.