ETV Bharat / sports

IPL 2022: టాస్​ గెలిచిన బెంగళూరు.. కోల్​కతా బ్యాటింగ్​ - కేకేఆర్​ బెంగళూరు మ్యాచ్​

IPL 2022 KKR VS RCB: ఐపీఎల్​ 15వ సీజన్​లో భాగంగా నేడు (బుధవారం) కోల్​కతా నైట్​ రైడర్స్​తో రాయల్​ ఛాలెంజర్స్​ జట్టు తలపడనుంది. మొదటగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన బెంగళూరు బౌలింగ్​ ఎంచుకుంది.

IPL 2022 KKR VS RCB
IPL 2022 KKR VS RCB
author img

By

Published : Mar 30, 2022, 7:08 PM IST

Updated : Mar 30, 2022, 7:20 PM IST

IPL 2022 KKR VS RCB: ఐపీఎల్​ ఆరంభ మ్యాచ్​లో విజయం సాధించి సీజన్​ను ఘనంగా ప్రారంభించిన కోల్​కతా.. ఓటమితో సీజన్​ను ప్రారంభించిన రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుతో మరికాసేపట్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్​ ఎంచుకుని కోల్​కతాను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 29 సార్లు తలపడ్డాయి. అందులో కోల్​కతా​.. 16 మ్యాచుల్లో గెలవగా.. బెంగళూరు 13 మ్యాచుల్లో విజయం సాధించింది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

ఊరిస్తున్న పలు రికార్డులు: మరికాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ సారథి కోహ్లీతో పాటు కేకేఆర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, శ్రేయస్‌ అయ్యర్‌లకు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ(212) మరో మూడు సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకుతాడు. మూడు ఫోర్లు కొడితే ఐపీఎల్‌లో 550 బౌండరీలు సాధించిన క్రికెటర్ల క్లబ్‌లో చేరుతాడు. ఐపీఎల్‌ కెరీర్​లో 3985 పరుగులు చేసిన రహానే.. ఈ మ్యాచ్‌లో మరో 15 పరుగులు చేస్తే 4000 పరుగుల క్లబ్‌లో చేరిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు. కోల్​కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ (198) రెండు ఫోర్లు కొడితే 200 బౌండరీల మార్కును చేరుకుంటాడు. మరో 5 పరుగులు చేస్తే.. 2400 పరుగుల మార్క్‌ను రీచ్‌ అవుతాడు.

తుది జట్ల వివరాలివీ

కోల్​కతా నైట్​రైడర్స్​: వెంకటేష్​ అయ్యర్​, అజింక్య రహానే, శ్రేయస్​ అయ్యర్​(కెప్టెన్​), నితీశ్​ రానా, సామ్​ బిల్లింగ్స్, ఆండ్రీ రసెల్​, సునీల్ నరైన్​, జాక్సన్​, ఉమేశ్​ యాదవ్​, టిమ్​ సౌథీ, వరుణ్​ చక్రవర్తి.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు: డుప్లెసిస్(కెప్టెన్​), విరాట్​ కోహ్లీ, అనుజ్​ రావత్​, దినేశ్ కార్తీక్​, రూథర్​ఫర్డ్​, అహ్మద్​, హసరంగ, డేవిడ్​ విల్లే, హర్షల్​ పటేల్​, ఆకాశ్​ దీప్​, మహమ్మద్​ సిరాజ్​.

ఇదీ చదవండి: ICC Rankings: మెరుగుపడిన అశ్విన్​.. మరి కోహ్లీ, రోహిత్?​​

Last Updated : Mar 30, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.