IPL 2022 GT VS LSG: ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టుకు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లఖ్‌నవూ బ్యాటర్లు దీపక్ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్థ శతకాలు సాధించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక మరో ఓపెనర్ డికాక్ కూడా షమీ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎవిన్ (10), మనీష్ పాండే(6) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. సగం ఓవర్లు అయ్యేసరికి లఖ్‌నవూ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు దీపక్ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్ ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే వీరిని కూడా గుజరాత్ బౌలర్లు తమ బంతులతో పెవిలియన్‌కు పంపారు. ఇక, ఇన్నింగ్స్ ముగిసే సమయానికి క్రీజులో కృనాల్ పాండ్య(21), చమీరా(1) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3, వరుణ్ ఆరోన్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
ఇదీ చదవండి: మహిళల ఐపీఎల్ జట్టును కొనేందుకు పంజాబ్ ఆసక్తి!