IPL 2022 CSK vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 13 పరుగుల తేడాతో గెలుపొందింది చెన్నైసూపర్ కింగ్స్. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 189 పరుగులకే పరిమితమైంది ఎస్ఆర్హెచ్. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్ (47) రాణించినా.. మిడిలార్డర్ విఫలమైంది. నికోలస్ పూరన్ (64*) ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై బౌలర్లలో ముఖేశ్ (4 వికెట్లు) అదరగొట్టాడు. శాంట్నర్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (99), డేవన్ కాన్వే (85*) అదరగొట్టడం వల్ల హైదరాబాద్‌కు చెన్నై భారీ లక్ష్యం నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌కు 203 పరుగులను లక్ష్యంగా ఉంచింది. చెన్నై ఓపెనర్లు తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రుతురాజ్ కాస్తలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఎంఎస్ ధోనీ 8, జడేజా ఒక పరుగు చేశాడు. హైదరాబాద్ బౌలర్ నటరాజన్‌కే రెండు వికెట్లు పడ్డాయి.
ఇదీ చదవండి: చెలరేగిన బౌలర్లు.. లఖ్‌నవూ హ్యాట్రిక్ విజయం