ETV Bharat / sports

ఐపీఎల్‌లో హోరాహోరీగా సాగిన ముంబయి x చెన్నై మ్యాచ్‌లివే - రోహిత్​ శర్మ

IPL 2022 CSK vs MI: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఈ రెండు పోటీపడుతున్నాయంటే అభిమానులకు పండగే. ఇప్పటికే ముంబయి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలవగా.. చెన్నై నాలుగు సార్లు ఆ ఘనత సాధించింది. దీంతో ఈసారి కూడా తమ రికార్డులను మరింత మెరుగు పర్చుకోవాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో 15వ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు వీటి మధ్య జరిగిన ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను ఓసారి గుర్తు చేసుకుందాం.

CSk vs Mi
IPL 2022
author img

By

Published : Mar 20, 2022, 1:02 PM IST

IPL 2022 CSK vs MI: ఐపీఎల్​లోనే అత్యధిక అభిమానులు కలిగిన జట్లు చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​. ఐదుసార్లు కప్పు కొట్టిన జట్టు ఒకటైతే.. నాలుగు సార్లు టైటిల్​ను సొంతం చేసుకున్న జట్టు మరొకటి.. మరి ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే ఏ స్థాయిలో ఉంటుంది. త్వరలో ఐపీఎల్​ 2022 ప్రారంభం కానున్న తరుణంలో ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠభరింతగా సాగిన పాత మ్యాచుల విశేషాలు ఓసారి చూద్దాం.

హర్భజన్‌ మాయాజాలం‌..

harbhajan Singh
హర్భజన్​ సింగ్​

తొలిసారి ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది 2011లో. హర్భజన్‌ మాయాజాలంతో ఆరోజు ముంబయి విజయం సాధించినా చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. తొలుత రోహిత్‌ శర్మ (87; 48 బంతుల్లో 8x4, 5x6) భారీ ఇన్నింగ్స్‌ ఆడడం వల్ల ముంబయి 164/4 స్కోర్‌ చేసింది. ఛేదనలో బద్రీనాథ్‌ (71 నాటౌట్‌; 48 బంతుల్లో 7x4, 2x6) ఒంటరి పోరాటం చేసినా మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. మధ్యలో హర్భజన్‌ 5 వికెట్లతో చెలరేగి చెన్నై నడ్డి విరిచాడు. అయితే, చివరివరకూ బద్రీనాథ్‌ క్రీజులో ఉండడం వల్ల చెన్నై ఆశలు వదులుకోలేదు. కానీ, ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు చేయాల్సిన స్థితిలో 16 పరుగులే చేసి చివరికి 156/9తో నిలిచింది. అలా ముంబయి 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

సచిన్‌, రోహిత్‌ కొట్టకపోతే..

rohit sharma
రోహిత్​ శర్మ

మరుసటి ఏడాదే మరో రసవత్తరమైన పోరు జరిగింది. ఇది ఆఖరి బంతివరకూ ఉత్కంఠగా సాగడం విశేషం. ఓటమి తప్పదనుకున్న ముంబయి ఊహించని విజయం సాధించింది. చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసి 173/8 భారీ స్కోర్‌ చేసింది. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మురళీ విజయ్‌ (41), సురేశ్‌ రైనా (36), డ్వేన్‌ బ్రావో (40), మహేంద్రసింగ్‌ ధోనీ (25) దంచికొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబయి అతికష్టం మీద గెలిచింది. ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయిన ఆ జట్టును సచిన్‌ తెందూల్కర్‌ (74; 44 బంతుల్లో 11x4, 1x6), రోహిత్‌ శర్మ (60; 46 బంతుల్లో 6x4, 2x11) ఆదుకున్నారు. అయితే, చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టు వరుసగా ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ బంతిని హిల్ఫెనాస్‌కు ఇచ్చాడు. అతడు తొలి మూడు బంతుల్లో 1 వికెట్ తీసి రెండు పరుగులే ఇవ్వడంతో చెన్నై విజయం ఖాయమనుకున్నారు. కానీ, డ్వేన్‌ స్మిత్‌ (24; 9 బంతుల్లో 2x4, 2x6) ఆఖరి మూడు బంతుల్లో ఒక సిక్సర్‌, రెండు ఫోర్లు బాదడం వల్ల ముంబయి విజయం సాధించింది.

ధోనీని ఔట్‌ చేసిన మునాఫ్‌..

ms dhoni
మహేంద్ర సింగ్​ ధోనీ

అలాగే 2013లో మరో చెప్పుకోదగ్గ మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 148/6 పరుగుల మోస్తరు స్కోర్‌ చేసింది. పొలార్డ్‌ (57; 38 బంతుల్లో 4x4, 5x6) అర్ధ శతకంతో రాణించగా.. దినేశ్‌ కార్తీక్‌ (37; 25 బంతుల్లో 4x4, 1x6), హర్భజన్‌ (21; 21 బంతుల్లో 1x4, 1x6) తమవంతు పరుగులు చేశారు. లక్ష్యం పెద్దది కాకపోవడం వల్ల చెన్నై విజయం సాధిస్తుందనే నమ్మకం ఉన్నా పరిస్థితులు తలకిందులయ్యాయి. 66కే ఐదు వికెట్లు కోల్పోయి ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోనీ (51; 26 బంతుల్లో 5x4, 3x6) ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. టెయిలెండర్లతో కలిసి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. అయితే, చివరి ఓవర్‌లో 12 పరుగులే చేయాల్సిన స్థితిలో ధోనీ ఔటయ్యాడు. మునాఫ్ పటేల్‌ వేసిన తొలి బంతికి పెవిలియన్‌ చేరాడు. ఆపై చెన్నై మరో రెండు పరుగులే చేసి 139/9తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి 8 పరుగులతో అనూహ్య విజయం సాధించింది.

బ్రావో కొట్టినా జాదవ్ గెలిపించాడు..

dwane bravo
డ్వేన్​ బ్రావో

ఇక 2018లో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనే ముంబయిపై చెన్నై అదిరిపోయే విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 165/4 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (40), సూర్యకుమార్‌ (43)కు తోడు హార్దిక్‌ పాండ్య (22), కృనాల్‌ పాండ్య (41) రాణించారు. అయితే, ఛేదనలో చెన్నై కూడా తడబడింది. 75కే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమివైపు పయనిస్తోంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డ్వేన్‌ బ్రావో (68; 30 బంతుల్లో 3x4, 7x6) విరోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. అతడికి కేదార్‌ జాదవ్‌ (24; 22 బంతుల్లో 1x4, 2x6) సహకరించాడు. ఇక 19వ ఓవర్‌ చివరి బంతికి బ్రావో కూడా ఔటవ్వడం వల్ల చెన్నై స్కోర్‌ 159/9గా నమోదైంది. ఆఖరి ఓవర్‌లో ముంబయి గెలవాలంటే ఒక్క వికెట్ కావాలి. చెన్నై విజయానికి 7 పరుగులు కావాలి. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి మూడు బంతులు వదిలేసిన జాదవ్‌ నాలుగో బంతిని సిక్సర్‌, ఐదో బంతిని బౌండరీకి తరలించి మ్యాచ్‌ను గెలిపించాడు.

ఆఖరి బంతికి మలింగ మాయ..

lasith malinga
వికెట్​ తీసిన ఆనందంలో మలింగ

చివరిసారి రెండు జట్ల మధ్య అత్యంత ఉత్కంఠగా సాగింది 2019 ఫైనల్‌ మ్యాచ్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 149/8 స్కోర్‌ చేసింది. పొలార్డ్‌ (41; 25 బంతుల్లో 3x4, 3x6) ఒక్కడే చెపుకోదగ్గ స్కోర్‌ చేశాడు. దీంతో చెన్నై విజయం నల్లేరుమీద నడకే అనిపించింది. కానీ, ఛేదనలో చెన్నై మరోసారి తడబడింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8x4, 1x6) భారీ ఇన్నింగ్స్‌ ఆడినా మిగతా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఆ జట్టు 19 ఓవర్లకు 141/5తో నిలిచింది. అప్పటికి క్రీజులో జడేజా (4), వాట్సన్‌(76) ఉండటం వల్ల చెన్నై గెలుస్తుందని అనుకున్నారు. కానీ మలింగ మాయ చేశాడు. తొలి మూడు బంతులకు నాలుగు పరుగులే ఇచ్చాడు. అయితే, నాలుగో బంతికి రెండు పరుగుల కోసం యత్నించి వాట్సన్‌ రనౌటయ్యాడు. దీంతో చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 4 పరుగులు అవసరమైంది. శార్ధూల్‌ ఠాకూర్‌(2) ఐదో బంతికి 2 పరుగులు తీశాడు. ఆరో బంతికి ఫ్లిక్‌షాట్‌ ఆడేందుకు చూసిన అతడు ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో చెన్నై 148/7 స్కోర్‌తో నిలిచి 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది. ముంబయి ఆఖరి బంతికి ఊహించని విజయం అందుకుంది.

ఇదీ చదవండి: Ipl 2022: ఐపీఎల్​కు ఈ విదేశీ స్టార్స్ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.