ETV Bharat / sports

IPL 2022: మరోసారి సీఎస్​కే కప్పు గెలిచేనా..?

IPL 2022 CSK: ఐపీఎల్​​ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్​కు చేరిన జట్టుగా.. అత్యధిక అభిమానులు ఉన్న జట్టుగా చెన్నై సూపర్​ కింగ్స్​ పేరు సంపాదించుకుంది. లీగ్​ చరిత్రలోనే రెండో విజయవంతమైన జట్టుగా సీఎస్​కే రికార్డు సృష్టించింది. మార్చి 26న ఐపీఎల్​​ 2022 మహా సంగ్రామం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలాలు, బలహీనతలను ఓ సారి పరిశీలిద్దాం.

author img

By

Published : Mar 16, 2022, 3:26 PM IST

csk
చెన్నై సూపర్​ కింగ్స్​

IPL 2022 CSK: రెండేళ్లపాటు నిషేధం.. నాలుగుసార్లు ఛాంపియన్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికసార్లు ఫైనల్‌కు దూసుకెళ్లిన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌.. కెప్టెన్‌ ఎంఎస్ ధోనీతోపాటు ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ను రిటెయిన్‌ చేసుకుంది. మరి మెగా వేలంలో ఎలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంది.. ఈసారి కెప్టెన్‌ కూల్‌ జట్టు కూర్పును ఎలా చేయబోతున్నాడు, సారథిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌గా విశ్లేషకులు భావిస్తోన్న తరుణంలో జట్టు బలాలు, బలహీనతలను ఓసారి అంచనా వేద్దాం..

CSK Captain Dhoni: ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో టీమ్‌ఇండియా అపూర్వమైన విజయాలను సాధించింది. అలానే తొలి ఎడిషన్‌ నుంచి సీఎస్‌కేను నడిపిస్తోన్న ఏకైక సారథి ఎంఎస్ ధోనీ.. బ్యాటర్‌గా ఫామ్‌లో లేకపోయినా కెప్టెన్సీ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. నాలుగుసార్లు సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈసారి మెగా వేలానికి ముందు ధోనీతోపాటు భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్‌కు చెందిన మొయిన్‌ అలీ, గతేడాది ఆరెంజ్‌ క్యాప్‌ విజేత రుతురాజ్‌ గైక్వాడ్‌ను సీఎస్‌కే రిటెయిన్‌ చేసుకుంది. వేలంలో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హరి నిషాంత్‌, జగదీశన్‌, కేఎం అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, శివమ్ దూబె, క్రిస్‌ జొర్డాన్‌, మహీశ్ తీక్షణ, ప్రిటోరియస్, డేవన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, సేనాపతి, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకీ, భగత్‌వర్మను సొంతం చేసుకుంది.

ప్రధాన బ్యాటర్లు వీరే.. ఆల్‌రౌండర్లే అధికం

CSK Team Players: గతేడాది డుప్లెసిస్‌-రుతురాజ్ జోడీ చెలరేగి ఆడటంతో కప్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు రుతురాజ్‌కు తోడుగా ఉతప్పను పంపొచ్చు. గత సీజన్‌ ఆఖర్లో ఉతప్ప ఫర్వాలేదనిపించాడు. ఆరంభ ఓవర్లలో స్ట్రోక్‌ప్లేతో బౌండరీలను అలవోకగా బాదుతాడు. ఇక మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, శివమ్‌ దూబె, ప్రిటోరియస్‌, ఎంఎస్ ధోనీ, డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ జొర్డాన్‌, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్‌... లోయర్‌ ఆర్డర్‌ వరకు ఆదుకోగల ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఓపెనింగ్‌ భాగస్వామ్యం పటిష్ఠంగా ఉంటేనే తర్వాత వచ్చే బ్యాటర్లు అలవోకగా పరుగులు రాబట్టగలరు. లేకపోతే ఒత్తిడికి చిత్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 25 మంది సభ్యుల్లో 9 మంది ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం.

దీపక్‌ చాహర్‌ నేతృత్వంలో..

deepak chahar
దీపక్​ చాహర్​

Deepak Chahar: ఐపీఎల్ 14వ సీజన్‌లో దీపక్ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హేజిల్‌వుడ్, సామ్‌ కరన్‌, డ్వేన్ బ్రావో వంటి పేస్‌ బౌలర్లు ఉండేవారు. ఇప్పుడు దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రావో మాత్రమే పాతవారు కాగా.. యువ ఆటగాళ్లు కేఎం అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, క్రిస్‌ జొర్డాన్‌, రాజ్‌వర్థన్‌, సిమన్‌జీత్‌ సింగ్, ఆడమ్‌ మిల్నే, ముకేశ్‌ చౌదరి ఉన్నారు. అయితే వీరిలో తుది జట్టులో ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ఇక స్పిన్‌ విభాగం పటిష్ఠంగానే ఉంది. రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, మిచెల్ సాంట్నర్‌ రూపంలో బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ చేయగలరు. కొత్తవారికి దాదాపు ఛాన్స్‌ రాకపోవచ్చు. అయితే ధోనీ ప్రయోగాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కూర్పే కీలకం.. ధోనీ ఏం మాయ చేస్తాడో..?

dhoni
ఎంఎస్​ ధోనీ

CSK Team Management: సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలిచిన గత సీజన్‌నే తీసుకుంటే ఓపెనర్లు శుభారంభం అందించేవారు. వారిద్దరిలో ఎవరో ఒకరు భారీ స్కోరు సాధించేవారు. ఒకవేళ ఓపెనర్లు విఫలమైతే అంబటి రాయుడు, మొయిన్‌ అలీ, రైనా, జడేజా, ధోనీ, బ్రావో, సామ్‌ కరన్‌ తలో చేయి వేసేవారు. ఇక ఆఖర్లో అవసరమైనప్పుడు దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాట్‌ను ఝలిపించారు. అందుకే ఈసారి కూడానూ కప్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తే మాత్రం అన్ని విభాగాల్లో జట్టును సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: IPL 2022: కొత్త జట్టు కప్పు కొట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.