ETV Bharat / sports

భారత్​లోనే ఐపీఎల్​-2022.. బీసీసీఐ క్లారిటీ!

author img

By

Published : Jan 9, 2022, 3:20 PM IST

IPL 2022: వచ్చే ఐపీఎల్​ సీజన్ నిర్వహణ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నాహాలు చేస్తోంది. భారత్​ వేదికగానే ఈ టోర్నీ నిర్వహించనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కొవిడ్​ వ్యాప్తి తీవ్రమైతే టోర్నీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని అన్నారు.

IPL
ఐపీఎల్

IPL 2022: ఈ ఏడాది వేసవిలో నిర్వహించే ఐపీఎల్‌ 15వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్‌గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు. భారత్‌లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టోర్నీ నిర్వహణ ఇక్కడ కష్టంగా మారితే.. ప్రత్యామ్నాయంగా విదేశీ వేదికలను సైతం ఎంచుకునే వీలుందని ఆయన వివరించారు. అంతకంటే ముందు ఐపీఎల్‌ మెగా వేలంపైనే బీసీసీఐ ప్రధానంగా దృష్టిసారించిందని పేర్కొన్నారు.

IPL 2022 in India: ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఇప్పటికైతే ఇంకా ఎలాంటి వేదికలను ఖరారు చేయలేదని ఆయన అన్నారు. ఇక ఈ టోర్నీ షెడ్యూల్‌ ప్రకటించకపోయినా ఏప్రిల్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది కొత్తగా రెండు జట్లు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకుంటుండగా ఆటగాళ్ల వేలం ఆలస్యం కానుంది. దీన్ని ఫిబ్రవరి తొలివారంలో నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ టోర్నీ జరిగే సమయానికి కేసులు అధికమైతే ఏం చేస్తారనే విషయాన్ని ప్రస్తావించగా.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే విదేశాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అధికారి స్పష్టం చేశారు. కానీ, తొలి ప్రాధాన్యత మాత్రం భారత్‌లోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

IPL 2022: ఐపీఎల్​ మెగావేలానికి ముహూర్తం ఫిక్స్​

సన్​రైజర్స్​ బ్యాటింగ్​ కోచ్​గా లారా.. కొత్త కోచింగ్​ టీమ్​ ఇదే

త్వరలో మహిళల ఐపీఎల్.. జైషా క్లారిటీ

IPl 2022: లఖ్​నవూ ఫ్రాంచైజీ పేరు ఇదేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.