ETV Bharat / sports

ముంబయి గూటికి 'బేబీ' డివిలియర్స్​- ఇతడి గురించి తెలుసా? - డెవాల్డ్​ బ్రెవిస్​

Dewald Brevis: అండర్​-19 వరల్డ్​కప్​లో సంచలనం.. ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​.. జూనియర్(బేబీ)​ డివిలియర్స్​ ఇప్పుడు ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ సొంతం. శనివారం జరిగిన వేలంలో ఇతడిని రూ. 3 కోట్లకు దక్కించుకుంది. మరి ఇతడిని ఏబీ డివిలియర్స్​తో ఎందుకు పోలుస్తారు? ఇద్దరికీ సంబంధం ఏంటి? ఇతడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.

ipl-2022-auctions-know-about-dewald-brevis

author img

By

Published : Feb 13, 2022, 10:35 AM IST

Updated : Feb 13, 2022, 11:30 AM IST

Dewald Brevis: ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో శనివారం పలువురు భారత కుర్రాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. మొత్తం పది ఫ్రాంఛైజీలు నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ క్రమంలోనే ఎప్పుడూ యువ టాలెంట్‌ను వెలికితీసే ముంబయి ఇండియన్స్‌ ఈసారి కూడా అదే పంథాను అనుసరించింది. బేబీ ఏబీ డివిలియర్స్‌గా పేరుగాంచిన దక్షిణాఫ్రికా యువ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. అతడీ వేలంలో కనీస ధర రూ.20లక్షలతో అడుగుపెట్టగా ముంబయి భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది.

వరల్డ్​కప్​లో సంచలనం..

అందుకు కారణం ఇటీవల జరిగిన అండర్‌-19 ప్రపంచకప్పే. అక్కడ ఈ యువ బ్యాట్స్‌మన్‌ 506 పరుగులు చేశాడు. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో 18 ఏళ్ల నాటి శిఖర్‌ ధావన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. 2004లో అంబటి రాయుడు కెప్టెన్సీలో ధావన్‌ 505 పరుగులు చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు దాన్నే బేబీ డివిలియర్స్‌ అధిగమించాడు. మరోవైపు మెగా వేలంలో ఈ యువ ప్రతిభావంతుడిని తీసుకొనేందుకు తొలుత చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్​ కింగ్స్​ ఆసక్తి చూపించాయి. అయితే, చివరికి ముంబయి సొంతం చేసుకుంది.

బేబీ ఏబీ.. ఒకే స్కూల్​.. ఒకే జెర్సీ నెం..

కాగా, అతడిని బేబీ డివిలియర్స్‌గా ఎందుకు పిలుస్తారంటే.. అతడు అచ్చం దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ తలపించేలా బ్యాటింగ్‌ చేస్తాడు. దీంతో అతడికి ఆ పేరు వచ్చింది. అలాగే అతడికి ఐపీఎల్‌లో డివిలియర్స్‌ ఆడిన ఆర్సీబీ జట్టంటే చాలా ఇష్టం. ఆ జట్టులో ఆడాలనే కోరిక ఉందని ఇటీవల ప్రపంచకప్‌ సమయంలో వెల్లడించడం గమనార్హం.

ipl-2022-auctions-know-about-dewald-brevis
డెవాల్డ్​ బ్రెవిస్​

డివిలియర్స్​ అంటే బ్రెవిస్​కు చాలా ఇష్టం. ఏబీ చదివిన స్కూల్లోనే ఇతడూ చదవడం విశేషం. డివిలియర్స్​ అనుమతితో అతడి జెర్సీ నంబర్​నే డెవాల్డ్​ కూడా ధరిస్తున్నాడు.

అండర్‌ 19 ప్రపంచకప్‌లో బ్రెవిస్‌ సాధించిన స్కోర్లు

  • భారత జట్టుపై 65 పరుగులు
  • ఉగాండాపై 104 పరుగులు
  • ఐర్లాండ్‌పై 96 పరుగులు
  • ఇంగ్లాండ్‌పై 97 పరుగులు
  • శ్రీలంకపై 6 పరుగులు
  • బంగ్లాదేశ్‌పై 138 పరుగులు

ఇవీ చూడండి: IPL 2022: యువ క్రికెటర్లపై కాసుల వర్షం.. టాప్​లో ఇషాన్​, దీపక్​

IPL 2022 Auction Memes: ఐపీఎల్‌ వేలంపై అభిమానుల ఫన్నీ మీమ్స్‌!

Last Updated : Feb 13, 2022, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.