ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్ మెగా వేలం.. తుది జాబితా ఇదే - ఐపీఎల్

IPL 2022: ఐపీఎల్​ 2022 కోసం మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది బీసీసీఐ. మొత్తం 590 మంది క్రికెటర్లు మెగావేలంలో పాల్గొనబోతున్నారు.

IPL 2022
ఐపీఎల్
author img

By

Published : Feb 1, 2022, 4:47 PM IST

Updated : Feb 1, 2022, 4:57 PM IST

IPL 2022: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది. ఇప్పటికే పాత జట్ల రిటెన్షన్‌, కొత్త టీమ్‌లు ఆటగాళ్ల ఎంపికతోపాటు వేలం కోసం రిజిష్ట్రేషన్‌ కూడా పూర్తి అయిపోయింది. దీంతో మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 590 మంది క్రికెటర్లు మెగావేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో 228 మంది క్యాప్‌డ్‌ (జాతీయ జట్లకు ఎంపికైన వారు), 355 మంది అన్‌క్యాప్‌డ్‌ (జాతీయ టీమ్‌కు ఎంపిక కానివారు), ఏడుగురు అసోసియేట్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లతోపాటు కొత్తగా లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలు వచ్చిన విషయం తెలిసిందే.

వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్ గేల్‌, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్ వేలంలో లేకపోవడం గమనార్హం. డుప్లెసిస్‌, డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, జానీ బెయిర్‌స్టో, జాసన్ హోల్డర్‌, డ్వేన్ బ్రావో, షకిబ్ అల్ సన్, వహిందు హసరంగ, దీపక్‌ చాహర్, శార్దూల్‌ ఠాకూర్‌, శ్రేయస్‌ అయ్యర్, కృనాల్ పాండ్య తదితరుల కోసం తీవ్ర పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

  • 𝘽𝙞𝙜 𝙉𝙖𝙢𝙚𝙨 𝙖𝙩 𝙩𝙝𝙚 𝙈𝙚𝙜𝙖 𝘼𝙪𝙘𝙩𝙞𝙤𝙣 💪🏻

    A bidding war on the cards 👍🏻 👍🏻

    Here are the 1⃣0⃣ Marquee Players at the 2⃣0⃣2⃣2⃣ #IPLAuction 🔽 pic.twitter.com/lOF1hBCp8o

    — IndianPremierLeague (@IPL) February 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సారి ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనబోయే వారిలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడు ఇమ్రాన్‌ తాహిర్ (43) కాగా..తక్కువ వయసు కలిగిన ఆటగాడు అఫ్గానిస్థాన్‌ అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ నూర్ అహ్మద్ (17). ఈ జాబితాలో సచిన్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ (బేస్‌ ప్రైస్‌ రూ. 20 లక్షలు)‌, బంగాల్ మంత్రి, క్రికెటర్ మనోజ్‌ తివారీ (రూ. 50 లక్షలు), వెటరన్‌ బౌలర్ శ్రీశాంత్ (రూ. 50 లక్షలు) మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ప్రస్తుతం జట్లు రిటెన్షన్‌, ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ : ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్
  • దిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, అక్షర్‌ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్‌ నార్జ్‌
  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ఆండ్రూ రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్
  • ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్
  • పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్, అర్షదీప్ సింగ్
  • రాజస్థాన్‌ రాయల్స్: సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్
  • సన్‌రైజర్స్ హైదరాబాద్‌: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్
  • అహ్మదాబాద్‌: హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్
  • లఖ్​నవూ: కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయ్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: సర్ఫర్ సోయగాలు.. మరీ ఇంత హాట్ ​గానా!

Last Updated : Feb 1, 2022, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.