ETV Bharat / sports

'ప్రజలను సంతోషపెట్టడమే మా బాధ్యత' - భారత్​లో కరోనా

భారత్​లో కరోనా కట్టడికి ఫ్రంట్​లైన్​ వర్కర్లు చేస్తున్న కృషిని కొనియాడాడు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ క్రిస్ మోరిస్. ఈ సంక్షోభ సమయంలో ప్రజలను సంతోష పెట్టేలా ఆడటమే తమ బాధ్యత అని వ్యాఖ్యానించాడు.

If we can keep people smiling, we are doing well as a sport, says Morris
ప్రజలను సంతోషపెట్టడమే మా బాధ్యత, క్రిస్ మోరిస్
author img

By

Published : Apr 25, 2021, 12:31 PM IST

దేశంలో ప్రస్తుతం కరోనా రెండో దశ ఉగ్రరూపం దాల్చడం వల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజల జీవితాల్లో ఐపీఎల్‌ కాస్తయినా ఆనందాన్ని నింపగలదని రాజస్థాన్‌ రాయల్స్ ఆల్‌రౌండర్‌ క్రిస్ మోరిస్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"భారతదేశంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే కొవిడ్ వ్యాప్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో అనే అంశంపై జట్టు సభ్యులందరం చర్చించుకొన్నాం. కరోనా నియంత్రణకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్ చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు 24 గంటలు కృషి చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. ఒక జట్టుగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరి బాధ మాకు తెలుసు. బయట ఏం జరగుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. మా ముఖాల్లో చిరునవ్వుకు కారణమైన వారి కోసం ఆడి.. వాళ్ల ముఖాల్లో కూడా చిరునవ్వు ఉండేలా చూడటం మా బాధ్యత. మేం గెలిచినా, ఓడినా మా ఆటను చూసిన ప్రజలకు అది కాస్తయిన ఉపశమనం ఇస్తే చాలు. కరోనా వారియర్స్‌కు, కొవిడ్ బాధితులకు రాజస్థాన్‌ రాయల్స్‌ అండగా ఉంటుంది"

-క్రిస్ మోరిస్‌, రాజస్థాన్‌ రాయల్స్ క్రికెటర్

శనివారం రాత్రి వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడగా.. కోల్‌కతాపై రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాయల్స్ విజయంలో క్రిస్‌ మోరిస్‌(4/23) కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చూడండి: దిల్లీ X హైదరాబాద్​: పైచేయి ఎవరిదో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.