దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ తుదిపోరులో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది ముంబయి ఇండియన్స్. ఆ జట్టు విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుపై టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఫైనల్లో పోరాడి ఓడిన దిల్లీ జట్టునూ అభినందించాడు యూవీ.
"ముంబయి ఇండియన్స్ జట్టుకు అభినందనలు. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ జట్టు మీది. ఫైనల్లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. దిల్లీ అద్భుతంగా పోరాడి, మనసుల్ని గెలుచుకుంది. పరుగుల్ని రాబట్టడంలో ఇషాన్ కిషన్ చాలా చాలా ప్రత్యేకమైన ఆటగాడు."
-యువరాజ్ సింగ్, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్
ముంబయి ఇండియన్స్ తరఫున పదమూడు మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ ఈసారి ఐపీఎల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 516 పరుగులు చేయగా.. అందులో 30 సిక్సర్లు ఉన్నాయి. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానం సంపాదించాడు. దిల్లీతో మంగళవారం జరిగిన ఐపీఎల్ తుదిపోరులో 20 బంతుల్లోనే 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు లీగ్ దశలో ఆర్సీబీతో జరిగిన పోరులో 99 పరుగులు నమోదు చేశాడు.
ఇదీ చూడండి:ఐపీఎల్ తుదిపోరు.. రికార్డులతో హిట్ మ్యాన్ జోరు