యునివర్స్ బాస్‌గా పేరొందిన క్రిస్ గేల్.. ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రారంభంలో వరుస ఓటములతో డీలా పడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. గేల్ రాకతో విజయాల బాట పట్టింది. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్పై స్పందించిన విండీస్ దిగ్గజం.. కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంకా సమయముందని అన్నాడు.
ఈ సీజన్లో పంజాబ్ తరఫున 5 మ్యాచ్‌లాడిన గేల్.. 177 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. 15 సిక్సులు కొట్టాడు.
టీ20ల్లో 'గేల్'
టీ20లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 409 మ్యాచ్‌లు ఆడి, 146.82 స్ట్రైక్ రేట్‌తో 13,473 పరుగులు చేశాడు.
ఇందులో భాగంగా గేల్.. 22 సెంచరీలు, 993 సిక్సర్లు కొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. దీని బట్టి చూస్తుంటే వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో గేల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:టీ20ల్లో అందుకే రషీద్ ఖాన్ గొప్ప బౌలర్!