ETV Bharat / sports

ఊరిస్తోన్న ప్లే ఆఫ్​ బెర్తు.. ముందుకెళ్లేది ఎవరో? - ఐపీఎల్​ ప్లేఆప్​ ఆశలు

ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐపీఎల్​-13 ప్లేఆఫ్​ బెర్తుల కథ క్లైమాక్స్​కు చేరుకుంది. ముంబయి మాత్రమే ఇప్పటిదాకా ప్లే ఆఫ్స్​కు ​చేరగా.. చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగతా 3 స్థానాల కోసం 6 జట్లు పోటీపడుతున్నాయి.

which team will reach to playoff berth except mumbai and chennai in ipl 2020
ఊరిస్తోన్న ప్లే ఆఫ్​ బెర్తు.. ముందుకెళ్లేది ఎవరో?
author img

By

Published : Nov 1, 2020, 9:35 AM IST

Updated : Nov 1, 2020, 10:05 AM IST

ఐపీఎల్​లో శనివారం నాటి రెండు మ్యాచ్​ల ఫలితాలతో రెండు విషయాలు ఖరారయ్యాయి. దిల్లీని చిత్తు చేసిన ముంబయి తొమ్మిదో విజయంతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. సన్‌రైజర్స్‌ చేతిలో బెంగళూరు ఓటమి చెందగా.. రెండో ప్లేఆఫ్‌ బెర్తుపై స్పష్టత వచ్చేసింది. దిల్లీ, బెంగళూరు సోమవారం తమ చివరి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. అందులో గెలిచే జట్టు 16 పాయింట్లతో రెండో ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఓడే జట్టు ముందంజ వేయడం.. ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది.

ఆరో విజయంతో ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్‌కు నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది కాబట్టి మంగళవారం చివరి మ్యాచ్‌లో ముంబయిని ఓడిస్తే నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్లిపోతుంది. ఆదివారం మధ్యాహ్నం చెన్నైని ఓడిస్తేనే పంజాబ్‌ ప్లేఆఫ్‌ రేసులో ఉంటుంది. రాత్రికి రాజస్థాన్‌-కోల్‌కతా మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచే జట్టు ముందంజ వేయడం నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి రెండు జట్లు ఏడు విజయాలతోనే ముందంజ వేయబోతుండటం విశేషం.

ఇదీ చూడండి:గేల్‌ 99 ఔట్‌: జోఫ్రాకు ముందే తెలుసా?

Last Updated : Nov 1, 2020, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.