ETV Bharat / sports

'పిచ్​ను వాళ్లు సరిగ్గా వినియోగించుకున్నారు'

author img

By

Published : Nov 1, 2020, 4:22 AM IST

ప్లే ఆఫ్​ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో హైదరాబాద్​ అదరగొట్టింది. బెంగళూరును 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇన్నింగ్స్​ మొదటి నుంచి తాము బ్యాటింగ్​లో తడబడ్డామని అన్నాడు బెంగళూరు సారథి విరాట్​ కోహ్లి. రానున్న మ్యాచ్​లో దిల్లీపై తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

We weren't brave enough with bat says royal challengers bangalore captain Kohli
'పిచ్​ను వాళ్లు సరిగ్గా వినియోగించుకున్నారు'

షార్జా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్​ చేతిలో పరాజయాన్ని చవిచూసింది బెంగళూరు​ జట్టు. తొలుత బ్యాటింగ్​కు దిగిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. నిర్ణీత ఓవర్లలో 120 పరుగులకు పరిమితమైంది.

ఛేదనకు దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​.. ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అయితే.. పిచ్​ను హైదరాబాద్​ జట్టు సక్రమంగా వినియోగించుకందని అభిప్రాయపడ్డాడు బెంగళూరు జట్టు సారథి విరాట్​ కోహ్లి. మంచు వల్ల బౌలింగ్​లో తాము ఇబ్బంది పడ్డామని చెప్పాడు.

"ఇన్నింగ్స్ ఆసాంతం మేము బ్యాటింగ్​లో తడబడ్డాం. ఇదంతా ప్రత్యర్థి జట్టుకే దక్కుతుంది. పిచ్​ను హైదరాబాద్​ జట్టు సక్రమంగా వినియోగించుకుంది. సెకండ్​ ఇన్నింగ్స్​లో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఊహించనంత మంచు ఏర్పడింది. టాస్​ గెలిచి హైదరాబాద్​ జట్టు సరైన నిర్ణయం తీసుకుంది. చివరలో బంతిపై పట్టు సాధించడం చాలా క్లిష్టంగా మారింది."

--విరాట్​ కోహ్లీ, బెంగళూరు జట్టు కెప్టెన్​.

బెంగళూరు కుర్రాడినే..

లీగ్​లో తాము తలపడే చివరి మ్యాచ్​లో, దిల్లీ క్యాపిటల్స్​పై గెలచి ప్లే ఆఫ్​లో నిలుస్తామని చెప్పాడు విరాట్​. ఐపీఎల్​లో తాను ఎప్పడూ బెంగళూరు వాడినేనని అన్నాడు.

"ప్లే ఆఫ్​లో కొనసాగడానికి లీగ్​లో మా చివరి మ్యాచ్​లో దిల్లీపై తప్పక గెలిచితీరాలి. ఆ మ్యాచ్​ మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఓ అవకాశం. పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. ఐపీఎల్​లో​ నేనెప్పుడూ బెంగళూరు కుర్రాడినే."

-విరాట్​ కోహ్లీ.

నవంబర్​ 2న, అబుదాబి వేదికగా దిల్లీ, బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

అప్పట్లో లాగే..

తాజా విజయంతో తమ లక్ష్యానికి మార్గం సుగమమైందన్నాడు హైదరాబాద్​ జట్టు సారథి డేవిడ్​ వార్నర్​. తమ విజయాన్ని ముందుగానే ఊహించామని చెప్పాడు. రానున్న గేమ్​లోనూ తాము గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

బెంగళూరుపై విజయం సాధించి 12 పాయింట్లను సాధించి, ప్లే ఆఫ్​ ఆశలను సజీవం చేసుకుంది సన్​రైజర్స్​ హైదరాబాద్​.

ఇదీ చూడండి:టీ20ల్లో ముంబయి ఇండియన్స్ ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.