ETV Bharat / sports

కోల్​కతా.. క్వాలిఫయింగ్​కు వెళ్లాలంటే ఇదే దిక్కు! - ఐపీఎల్​ తాజా

ప్లే ఆఫ్​ రేసులో కోల్​కతా నిలవడంపై ఆ జట్టు కెప్టెన్​ ఇయాన్ మోర్గాన్​ ఆనందం వ్యక్తం చేశాడు. ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించే విషయంలో టీమ్​ సభ్యులు ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు చెప్పాడు. మరి కోల్​కతా క్వాలిఫయింగ్​కు వెళ్లాలంటే ఎలా?

We couldn't have done anything more, up to Gods now: Morgan
కోల్​కతా.. క్వాలిఫయింగ్​కు వెళ్లాలంటే.. ఇదే దిక్కు!
author img

By

Published : Nov 2, 2020, 2:39 AM IST

క్వాలిఫయింగ్​ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ అద్భుత విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో రాజస్థాన్​ రాయల్స్​ను మట్టికరిపించింది. విజయంపై కోల్​కతా కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్ హర్షం వ్యక్తం చేశాడు. తమ టీమ్​ చేయాల్సిందంతా చేసిందని ఇక క్వాలిఫయింగ్​కు వెళ్లడం దేవుడి దయ అన్నాడు.

"నంబర్స్ (నెట్​ రన్​రేట్)​ గురించి నాకు తెలుసు. కానీ అంతకన్నా గెలిచే స్థితిలో మేం ఉండటం ముఖ్యం. గెలవాల్సిన మ్యాచ్​లో గెలిచాం. ఇక క్వాలిఫయింగ్​కు​ వెళ్లడం దేవుడి దయ."

- ఇయాన్​ మోర్గాన్, కోల్​కతా నైట్​ రైడర్స్​ కెప్టెన్

ప్రస్తుతం కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు 14 పాయింట్లతో టాప్- 4 లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆ జట్టు నెట్​ రన్​రేట్ -0.214గా ఉంది. అయితే ఇది క్వాలిఫయింగ్​కు వెళ్లేందుకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

ఆ మ్యాచ్​లు కీలకం...

POINTS TABLE
పాయింట్స్​ టేబుల్

కేకేఆర్​ జట్టు క్వాలిఫయింగ్​కు చేరాలంటే ఈ రెండు మ్యాచ్​ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

  1. దిల్లీ క్యాపిటల్స్ X రాయల్ ఛాలెంజర్స్​ ఆఫ్​ బెంగళూరు
  2. సన్​ రైజర్స్​ ఆఫ్​ హైదరాబాద్​ X ముంబయి ఇండియన్స్​

సన్​ రైజర్స్​, ముంబయి మ్యాచ్​లో హైదరాబాద్​ గెలిస్తే.. దిల్లీ క్యాపిటల్స్​, ఆర్​సీబీ మ్యాచ్​లో ఏ జట్టైనా ఘోరంగా ఓడిపోతేనే కేకేఆర్​కు క్వాలిఫయింగ్​కు వెళ్లే అవకాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.