తొలి మూడు మ్యాచుల్లో జట్టు భారమంతా తానొక్కడిపై వేసుకోవడం వల్లే బాగా ఆడలేకపోయనని బెంగళూరు కెప్టెన్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. శనివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లో వచ్చిన కోహ్లీ(90).. గెలిచిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు పూర్తి స్థాయిలో రాణించిందని చెప్పాడు.
"మేం సమష్టి ప్రదర్శన చేసిన మ్యాచుల్లో ఇదొకటి. ప్రస్తుతం వరుసగా మ్యాచ్‌లు బాగా ఆడుతున్నాం. ఆడిన తొలి మూడు మ్యాచుల్లో నాపై ఒత్తిడి ఎక్కువ పెట్టుకున్నాను. మనమీద భారం పెరిగిపోతే ఓ ఆటగాడిగా జట్టుకు సహకారం అందించలేం. అందుకే బాగా ఆడలేకపోయాను"
-కోహ్లీ, బెంగళూరు సారథి
ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో క్రిస్ మోర్గాన్(3 వికెట్లు), వాషింగ్టన్ సుందర్(2 వికెట్లు) కీలక పాత్ర పోషించారు. "మైదానంలో దిగినప్పటి నుంచి వారు ఎంతో ఉత్కంఠంగా బాగా ఆడారు" అని కోహ్లీ ప్రశంసించాడు.
కోహ్లీ ఆడిన తొలి మూడు మ్యాచుల్లో 14, 1, 3 పరుగులు చేసిి అభిమానులను నిరాశపరిచాడు. ఆ తర్వాత మ్యాచుల్లో 72, 43 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. చెన్నైతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 90 నాటౌట్ (52 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. అక్టోబరు 12న జరిగే తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్: జకోవిచ్ x నాదల్