సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, తమ జట్టులోని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. గెలుస్తామనే మనస్తత్వంతో ఉండాలని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ పోస్ట్ చేసింది.
"మనమంతా గెలవాలనే మనస్తత్వంతో ఉండాలి. గత రెండున్నర వారాల కంటే ఎక్కువ సరదా, వచ్చే వారంలో ఉంటుందని హామీ ఇస్తున్నాను. మనం సరైన ఆలోచనా ధోరణితో వెళ్తే నమ్మశక్యం కాని ఫలితం వస్తుంది"
-- కోహ్లీ, బెంగళూరు జట్టు కెప్టెన్
ఎలిమినేటర్ మ్యాచ్.. అబుదాబి వేదికగా శుక్రవారం జరగనుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లను సాధించింది బెంగళూరు. లీగ్ ఆఖరి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓడినప్పటికీ ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించింది. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్.. ఈ సీజన్లో 472 పరుగులు చేసి, జట్టులోని ఆటగాళ్ల కంటే ముందున్నాడు. బౌలర్లలో చాహల్ 14 వికెట్లతో ఉన్నాడు.
ఇదీ చూడండి: