బెంగళూరు జట్టు సారథి కోహ్లీ దూకుడుగా ఆడాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. విరాట్ నెమ్మదిగా ఆడుతున్నాడని అందుకే జట్టుకు విజయ అవకాశాలు చేజారిపోతున్నాయని అభిప్రాయపడ్డాడు. ఎలిమినేటర్ జరగనున్న నేపథ్యంలోనే సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"కోహ్లీ గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో లయ అందుకోవడానికి 20-25 బంతులు తీసుకుంటున్నాడు. అది సరికాదు. అతడు ఔట్ అవ్వగానే జట్టు కూడా కష్టాల్లోకి వెళుతోంది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోను ఇలానే జరిగింది"
-సెహ్వాగ్, భారత దిగ్గజ క్రికెటర్
ప్లేఆఫ్స్‌కు చేరకముందు వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయింది బెంగళూరు జట్టు. నవంబరు 6న జరిగే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
ఇవీ చూడండి: