దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్య విజయం సాధించింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఆనందంతో డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చి.. గెలుపు సంబరాలు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అసలైన పునరాగమనం అంటే ఇది అంటూ విరాట్ కోహ్లీ సింహంలా గర్జించాడు. తన జట్టుకు ఈ విజయం ఎందుకంత ముఖ్యమో విరాట్ వివరించాడు.
-
‘A comeback and a half’ says Captain Virat Kohli, as the RCB players rejoice in the dressing room after their 10-run win against SRH.
— Royal Challengers Bangalore (@RCBTweets) September 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch how the players expressed their emotions after the game. #PlayBold #WeAreChallengers #SRHvRCB #Dream11IPL pic.twitter.com/0KslENJdnM
">‘A comeback and a half’ says Captain Virat Kohli, as the RCB players rejoice in the dressing room after their 10-run win against SRH.
— Royal Challengers Bangalore (@RCBTweets) September 22, 2020
Watch how the players expressed their emotions after the game. #PlayBold #WeAreChallengers #SRHvRCB #Dream11IPL pic.twitter.com/0KslENJdnM‘A comeback and a half’ says Captain Virat Kohli, as the RCB players rejoice in the dressing room after their 10-run win against SRH.
— Royal Challengers Bangalore (@RCBTweets) September 22, 2020
Watch how the players expressed their emotions after the game. #PlayBold #WeAreChallengers #SRHvRCB #Dream11IPL pic.twitter.com/0KslENJdnM
"ఆర్సీబీ తరఫున ఆడి వరుసగా ఆరు ఓటముల్లో భాగమైన వాళ్లకు ఈ విజయం ప్రాముఖ్యత తెలుస్తుంది. మేము 170 కంటే తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించాం. మంచు కారణంగా పిచ్‌పై బౌలర్లకు చాలా కష్టమైంది. అయితే, ఇదే మైదానంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్ జట్ల మ్యాచ్‌ను మా ఆటగాళ్లు పరిశీలించారు. కాబట్టి, వాళ్లు మంచి ప్రదర్శన చేశారని అనుకుంటున్నా."
-కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్ మాట్లాడుతూ.. "నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు 160 పరుగులు చేయాలని అనుకున్నా. అంతకంటే తక్కువ స్కోరు చేస్తే.. మాకు ఒత్తిడి తప్పదని అర్థమైంది. జట్టు సమష్టి కృషిపై చాలా సంతోషంగా ఉంది. చాహల్, దూబే అనూహ్య బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు" అని పేర్కొన్నాడు.
బెంగళూరు జట్టు తర్వాత మ్యాచ్‌లో సెప్టెంబరు 24న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో తలపడనుంది.