బెంగళూరు జట్టు సారథి కోహ్లీని విమర్శించిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఆర్సీబీ వైఫల్యానికి విరాట్ పేలవ ప్రదర్శనమే కారణమని అన్నాడు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ప్లేఆఫ్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. సీజన్ నుంచి నిష్క్రమించింది.
-
Totally agree with Gautam gambhirpic.twitter.com/EAhd7JpCBY#ThankyouKohli
— Govinda (@govinda_ind) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Totally agree with Gautam gambhirpic.twitter.com/EAhd7JpCBY#ThankyouKohli
— Govinda (@govinda_ind) November 7, 2020Totally agree with Gautam gambhirpic.twitter.com/EAhd7JpCBY#ThankyouKohli
— Govinda (@govinda_ind) November 7, 2020
"లీగ్ చరిత్రలో విజవంతమైన సారథులుగా కొనసాగుతోన్న ధోనీ, రోహిత్ శర్మతో కోహ్లీని పోల్చకూడదు. కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకోవడం 100 శాతం సరియైనది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలంలో ఒక్క ట్రోఫీని జట్టుకు అందించలేకపోయాడు. కాబట్టి దీనికి జవాబుదారీతనం కావాలి. ఈ వైపల్యానికి తనే కారణమని అతడు ఒప్పుకోవాలి. పంజాబ్ జట్టుకు రెండు సీజన్లలో రవిచంద్రన్ అశ్విన్ సారథిగా వ్యవహరించాడు. అప్పడు జట్టు విజయం సాధించలేకపోయింది. అనంతరం వెంటనే అతడిని ఆ పదవి నుంచి తప్పించి మరొకరికి కట్టబెట్టారు. ఇక రోహిత్(4), ధోనీ(3)సార్లు టైటిల్స్‌ను అందుకున్నారు. అందుకే వారు కెప్టెన్లుగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. కాబట్టి ఒక్కో వ్యక్తికి ఒక్కో విధానం ఉండకూడదని నా అభిప్రాయం"
-గంభీర్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్
మరోవైపు ఈ ఐపీఎల్లో కోహ్లీ.. తన స్టాండర్డ్స్‌కు తగ్గట్లు ఆడలేదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు జట్టు వైఫల్యానికి ఇది ఓ కారణమని అన్నాడు. విరాట్-డివిలియర్స్, ప్రతి మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాల్సిందని అన్నాడు.
ఇదీ చూడండి: