కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఆటతీరుపై విమర్శలూ వచ్చాయి. చెన్నై ఓ దశలో విజయానికి చేరువగా వచ్చి అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో అభిమానులతో పాటు పలువురు మాజీలు సీఎస్కే ఆటగాళ్ల ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశారు. టీమ్ఇండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్ కూడా చెన్నై ఆటగాళ్లపై విమర్శలు చేశాడు.
"ఆ లక్ష్యాన్ని చేధించి ఉండాల్సింది. కానీ కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా ఎక్కువగా డాట్ బాల్స్ ఆడారు. నా అభిప్రాయం ప్రకారం.. కొందరు చైన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సీఎస్‌కే వైపు ఆడటం ప్రభుత్వ ఉద్యోగంగా భావిస్తున్నారు. సరిగ్గా ఆడిన, ఆడకపోయినా వాళ్ల జీతాలు అందుతాయని అనుకుంటున్నారు."
-సెహ్వాగ్, మాజీ క్రికెటర్
కోల్‌కతా నిర్దేశించిన 168 పరుగులను చేధించేందుకు బరిలో దిగిన సీఎస్కే ప్రారంభంలో బాగానే ఆడింది. చివరి 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 10 పరుగులతో విజయం సాధించింది. ఛేజింగ్‌లో బ్రావో, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా కన్నా ముందు కేదార్ జాదవ్‌ను పంపడంపై అందరూ విమర్శలు వ్యక్తం చేశారు.