కోల్‌కతా బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు ఆ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ గిల్‌లో ఉన్నాయని అన్నాడు. శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడి అందర్నీ మెప్పించాడు.
నిర్దేశిత 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది కోల్‌కతా. గిల్ 70(62బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు. మోర్గాన్(42)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో గిల్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. భారత్ అండర్-19 ప్రంపచకప్ గెలవడంలోనూ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అతని బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందన్న నమ్మకం కలిగించాడు.
ప్రస్తుతం కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న దినేశ్ కార్తీక్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయాడు. కెప్టెన్‌గానూ ఆశించన ఫలితాలు ఇవ్వడం లేదు. జట్టులో మేటి ఆటగాళ్లున్నప్పటికీ ప్లేఆఫ్స్ దాటించలేకపోతున్నాడు. గతేడాది అయితే లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టంది. దీంతో యువ ఆటగాడు గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.