ETV Bharat / sports

ఫైనల్​కు ముందు చిందేస్తోన్న దిల్లీ ఆటగాళ్లు - ఢిల్లీ క్యాపిటల్స్​ వార్తలు

తొలిసారి ఐపీఎల్​ ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్​ అడుగుపెట్టడం వల్ల ఆ జట్టు ఆటగాళ్లు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా ఓపెనర్లు శిఖర్​ ధావన్​, మార్కస్​ స్టోయినిస్​తో కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ డ్యాన్స్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ వీడియోను సోషల్​మీడియాలో పంచుకుంది దిల్లీ ఫ్రాంచైజీ.

Shreyas Iyer, Marcus Stoinis and Shikhar Dhawan pull off hilarious dance ahead of title clash vs MI
కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​తో ధావన్​, స్టోయినిస్​ డాన్స్​​
author img

By

Published : Nov 9, 2020, 9:06 PM IST

ఐపీఎల్​లో వరుసగా 12 సీజన్లలో వైఫల్యాల తర్వాత దిల్లీ క్యాపిటల్స్​ తొలిసారి ఫైనల్​లో అడుగుపెట్టింది. ఆదివారం సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రేయస్​ జట్టు విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. ముంబయి ఇండియన్స్​తో ఫైనల్​లో తలపడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా ఆ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లు శిఖర్​ ధావన్​, మార్కస్​ స్టోయినిస్​లతో పాటు కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ డ్యాన్స్ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. ఈ వీడియోను దిల్లీ క్యాపిటల్స్​ సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది.

తుదిపోరుకు అర్హత కోసం తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 17 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రేయస్​ సేన తొలిసారి ఫైనల్​లో అడుగుపెట్టింది. ఓపెనర్లుగా దిగిన ఆల్​రౌండర్​ స్టోయినిస్​, ధావన్​ అద్భుత ఇన్నింగ్స్​తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 12 ఏళ్ల తర్వాత తమ జట్టు తొలిసారి ఫైనల్​కు చేరడంపై దిల్లీ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.