ETV Bharat / sports

టీ20లు మెరుగవ్వడానికి వార్న్​ సూచనలు - షేన్​వార్న్​ టీ20 మార్పులు

టీ20ల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల ఈ ఫార్మాట్​ మరింత ఆకర్షణీయంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ షేన్​ వార్న్​. పొట్టి ఫార్మాట్​లో బ్యాట్స్​మన్​తో పాటు బౌలర్లూ రాణించాలనేదే తన ఆకాంక్షని వెల్లడించాడు.

Shane Warne suggests new changes to improve T20 cricket
పొట్టి ఫార్మాట్​ మెరుగవ్వడానికి షేన్​వార్న్​ సూచనలు
author img

By

Published : Oct 2, 2020, 9:58 PM IST

ప్రస్తుత టీ20 ఫార్మాట్​లో కొన్ని మార్పులు వస్తే అది మరింత ఆకర్షణీయంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్​ షేన్​వార్న్. దీని కోసం ట్విట్టర్​ ద్వారా కొన్ని సూచనలు చేశాడు. బౌలింగ్ పరిమితితో పాటు బౌండరీ లైన్​ను మరింత దూరంగా ఉండేలా చూడటం వంటి రూల్స్​ టీ20 మెరుగవ్వడానికి సహాయపడతాయని సూచించాడు.

  • I would improve T/20 cricket by

    1 Boundaries as big as poss at each venue & on small grounds keep grass on the outfield long
    2 Bowlers a max of 5 overs not four
    3 Pitch must = day 4 test match pitch & not be a flat rd
    As we all want a contest between bat & ball not just 6’s

    — Shane Warne (@ShaneWarne) October 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టీ20 క్రికెట్​ మరింత మెరుగవ్వడానికి నేను కొన్ని సూచనలు చేస్తున్నా.

(1) ప్రతి స్టేడియంలో వీలైనంత పెద్ద బౌండరీలతో పాటు చిన్న మైదానాల్లోని అవుట్​ ఫీల్డ్​లో గడ్డిని బాగా పెంచాలి.

(2) బౌలర్లకు ప్రస్తుతం ఇస్తున్న నాలుగు ఓవర్ల గరిష్ఠ పరిమితిని 5 ఓవర్లకు పెంచాలి.

(3) టెస్టు మ్యాచ్​ 4వ రోజున స్టేడియం ఎలా ఉంటుందో ప్రతి పిచ్​ అలానే ఉండాలి. మరీ ఫ్లాట్​గా ఉండి సిక్సులకు అనుకూలించకుండా.. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​కు అనువుగా ఉండాలి. బ్యాట్​, బాల్​కు మధ్య పోటీనే మనమందరం కోరుకుంటాం".

- షేన్​ వార్న్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

గురువారం ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో చివరి ఆరు ఓవర్లలో 104 పరుగులు చేయగలిగింది ముంబయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. చిన్న బౌండరీలు బౌలర్లను దెబ్బతీస్తున్నాయని తెలిపాడు వార్న్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.