ETV Bharat / sports

'ఎంత గొప్ప ఆటగాళ్లున్నా.. గెలిపించేది నమ్మకమే' - ఐపీఎల్​ తాజా

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్​లో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ.. జట్టులో ఎంత గొప్ప ఆటగాళ్లున్నా, నమ్మకం లేకపోతే అనుకున్న విధంగా ఫలితం రాదని అన్నాడు.

VIRAT_RCB
'ఎంత గొప్ప ఆటగాళ్లున్నా.. గెలిపించేది నమ్మకమే'
author img

By

Published : Oct 22, 2020, 5:20 AM IST

బుధవారం జరిగిన మ్యాచ్​లో కోల్​కతాను చిత్తు చేసింది ఆర్సీబీ. ఈ సందర్భంగా జట్టు విజయంపై హర్షించిన బెంగూళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చాలా మంది ప్రేక్షకులకు ఆర్సీబీపై నమ్మకం ఉండదని అన్నాడు. కానీ జట్టు సభ్యులు, తాను.. పూర్తి విశ్వాసంతో ఉంటామని, అదే చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.

" జట్టులో ఎంత గొప్ప ఆటగాళ్లున్నా ఎవరిపై వారికి నమ్మకం లేకపోతే విజయం సాధించలేం. ఈ మ్యాచ్​ ప్రారంభంలో వాషింగ్టన్​ సుందర్​, మోరిస్​ మాత్రమే మొదట బౌలింగ్ అవకాశం ఇద్దాం అనుకున్నా. కానీ, మోరిస్​తో కలిసి సిరాజ్​కు అవకాశమిచ్చాను. ప్లాన్​ ఏ, ప్లాన్​ బీతో సిద్ధంగా ఉన్నాం. టీం కూడా దానికి అనుగుణంగా కృషి చేశారు".

-విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్

సిరాజ్​, మోరిస్​లపై ప్రశంసలు..

తనదైన శైలిలో అత్యుత్తమ బౌలింగ్ చేసి ఈ మ్యాచ్​లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పిన సిరాజ్​ను కెప్లెన్​ కోహ్లీ ప్రశంసించాడు. గతేడాది సిరాజ్​కు చేదు అనుభవాలు ఎదురయ్యాయని గుర్తుచేశాడు. ప్రస్తుతం సిరాజ్​ ఆట చాలా మారిందని, ఇలాగే కొనసాగాలని కోరుకున్నాడు.

మోరిస్​పై కూడా ప్రశంసల వర్షం కురింపించాడు విరాట్ కోహ్లీ. మోరిస్​ దృఢ సంకల్పంతో ఉంటాడని అన్నాడు. మ్యాచ్​లో బాధ్యతాయుతంగా ఉంటాడని, ఓ నాయకుడిలా ప్రవర్తిస్తాడని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:కోల్​కతాపై బెంగళూరు ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.