రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియాపై టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తెవాతియ స్టన్నింగ్ క్యాచ్‌కు తాను ముగ్ధుడయ్యానని అన్నాడు. ఈ మేరకు అతడిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశాడు.
-
Tewatia kuchh bhi kar sakte hain.
— Virender Sehwag (@virendersehwag) October 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Agar Covid vaccine banane ka ek mauka mil gaya, toh jaisa unka time chal raha hai , lagta hai bana denge. What a season for him. #RRvRCB pic.twitter.com/WYY5mojrKC
">Tewatia kuchh bhi kar sakte hain.
— Virender Sehwag (@virendersehwag) October 17, 2020
Agar Covid vaccine banane ka ek mauka mil gaya, toh jaisa unka time chal raha hai , lagta hai bana denge. What a season for him. #RRvRCB pic.twitter.com/WYY5mojrKCTewatia kuchh bhi kar sakte hain.
— Virender Sehwag (@virendersehwag) October 17, 2020
Agar Covid vaccine banane ka ek mauka mil gaya, toh jaisa unka time chal raha hai , lagta hai bana denge. What a season for him. #RRvRCB pic.twitter.com/WYY5mojrKC
"తెవాతియా.. మైదానంలో నువ్వు ఏమైనా చేయగలవు. కరోనా వ్యాక్సిన్‌ను కనుక్కోమని నీకు ఓ అవకాశం ఇస్తే.. అది కూడా కనిపెట్టేస్తావు. ఈ సీజన్ నీకు బాగా కలిసొచ్చింది" అని సెహ్వాగ్ పొగడ్తలతో ముంచెత్తాడు.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తెవాతియా ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. జోరు మీదున్న కోహ్లీ భారీ షాట్ ఆడాడు. అది బౌండరీ వైపు వెళ్తుండగా తెవాతియా తుపానులా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని గాల్లోకి నెట్టేశాడు. బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి బంతిని అందుకున్నాడు. దీంతో పలువురు క్రికెటర్లు, మాజీలు, అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదీ చూడండి ధోనీ నెట్స్‌లో మరింత శ్రమించాలి: మియాందాద్