ETV Bharat / sports

వరుసగా రెండు శతకాలతో గబ్బర్ సరికొత్త రికార్డు - ఐపీఎల్ 20 ధావన్

గబ్బర్​ మళ్లీ సెంచరీతో కదం తొక్కాడు. పంజాబ్​తో మ్యాచ్​లో సెంచరీతో ఐపీఎల్​లో వరుసగా రెండు శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా శిఖర్ ధావన్​ రికార్డు సృష్టించాడు. ఇదే మ్యాచ్​లో ఐపీఎల్​లో 5 వేల పరుగులు పూర్తి చేశాడు ధావన్​. అంతర్జాతీయ క్రికెట్​లో ధావన్ అడుగుపెట్టి మంగళవారంతో 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

Dhawan
శిఖర్ ధావన్
author img

By

Published : Oct 21, 2020, 5:09 AM IST

పంజాబ్​తో మ్యాచ్​లో దిల్లీ స్టార్ బ్యాట్స్​మన్ శిఖర్ ధావన్​ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్​లో రెండు వరుస మ్యాచ్​ల్లో సెంచరీలు చేసిన ఏకైన ఆటగాడిగా గబ్బర్ చరిత్రకెక్కాడు.

అంతేకాదు, ఈ మ్యాచ్​లో రవి బిష్ణోయ్​ వేసిన 13వ ఓవర్​లో సిక్స్​తో ఐపీఎల్​లో 5 వేల పరుగులు సాధించాడు గబ్బర్. ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్​గా నిలిచాడు.

యాదృచ్ఛికంగా మంగళవారంతో ధావన్​ అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయింది.

  • 10 years with Team India, 10 years playing for my country - there has been no greater honour. Representing my nation has given me memories for a lifetime, that I am always grateful for 🙏 🇮🇳 pic.twitter.com/8ULk1gHgpZ

    — Shikhar Dhawan (@SDhawan25) October 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలుత టాస్​ గెలిచిన దిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్​గా బరిలో దిగిన ధావన్.. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 20 ఓవర్లకు దిల్లీ 164 పరుగులు చేసింది.

దిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని నికోలస్​ పూరన్ (53), మ్యాక్స్​వెల్​ (32) సాయంతో పంజాబ్ ఛేదించింది. అయితే, సెంచరీ హీరో ధావన్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

ఇదీ చూడండి: పంజాబ్​ హ్యాట్రిక్​ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.