ETV Bharat / sports

ఆర్సీబీxకోల్​కతా : విజయమే లక్ష్యంగా బరిలోకి! - ipl matches preview

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది.  భారత కాలమాన ప్రకారం ఈ పోరు సాయంత్రం 7.30గంటలకు ప్రారంభంకానుంది.

rcb vs kolkata match preview
ఆర్సీబీxకోల్​కతా
author img

By

Published : Oct 21, 2020, 5:30 AM IST

అబుదాబి వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు.. ఐదు మ్యాచ్​లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కోల్​కతా నైట్​ రైడర్స్​​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరుజట్లు ఈ మ్యాచ్​లో గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ సందర్భంగా రెండు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

అదే ఫామ్​ కొనసాగిస్తే విజయం పక్కా!
రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఓపెనర్లు దేవ్​దత్ పడిక్కల్​, ఆరోన్​ ఫించ్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. గత మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​పై కెప్టెన్ విరాట్​ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్ని అందించాడు. మిడిల్ ఆర్డర్​లో ఏబీ డివిలియర్స్​, శివమ్ దూబె ఫామ్​లో ఉన్నారు. ఇక క్రిస్​ మోరిస్​ రాకతో బౌలింగ్​ లైనప్​ మరింత శక్తిమంతంగా మారింది. గత మ్యాచ్​ల్లోని తుది జట్టు అద్భుతంగా రాణించడం వల్ల ఈ మ్యాచ్​లో ఆటగాళ్లను దాదాపుగా మార్చే అవకాశం లేదు. అందరూ ఫామ్​ కొనసాగిస్తే ఆర్సీబీ విజయం సాధించడం ఖాయం.

కోల్​కతా నైట్​ రైడర్స్
కోల్​కతా నైట్​ రైడర్స్.. లీగ్​ ప్రారంభం నుంచి మిశ్రమ ప్రదర్శన చేస్తోంది. ఓ మ్యాచ్​లో అదరగొట్టిన ఆటగాళ్లు మరో మ్యాచ్​లో తేలిపోతున్నారు. శుభ్​మన్​ గిల్​, నితీశ్​ రాణా , త్రిపాఠి, మోర్గాన్​, కార్తీక్​ గత మ్యాచ్​లో సన్​రైజర్స్​పై బాగానే రాణించారు. రసెల్​ మాత్రం విఫలమయ్యాడు. బౌలింగ్​లో ఫెర్గుసన్ మూడు వికెట్లు పడగొట్టి అందరీ దృష్టిని ఆకర్షించాడు. ఇతడు ఈ ఫామ్​ను కొనసాగిస్తే బెంగళూరును ఎక్కవ స్కోరు చేయకుండా కట్టడి చేయవచ్చు. కమిన్స్​, శివమ్​ మావి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్​ యాదవ్​ పర్వాలేదనిపిస్తున్నారు. ఆర్సీబీపై గెలవాలంటే జట్టు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది

జట్లు (అంచనాలు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, షాహబాద్ అహ్మద్, ఇసురు ఉదానా, నవదీప్ సైనీ, చాహల్

కోల్​కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్​మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్ గ్రీన్, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.