రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తన జట్టు తరఫున 6 వేల పరుగులు చేసి.. ఓ జట్టుకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌తో కలిపి ఈ మార్క్‌ను అందుకున్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు (90) చేసిన కెప్టెన్‌గా మరో ఘనత సాధించాడు విరాట్.
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 52 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. అయితే శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మహేంద్ర సింగ్ ధోనీ మినహా మిగతా ముగ్గురు కెప్టెన్లు అర్ధసెంచరీలు చేశారు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ 58 పరుగులు చేసి పంజాబ్‌పై తన జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే పంజాబ్ కెప్టెన్ రాహుల్ కూడా 74 పరుగులు సాధించాడు.