ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది సీఎస్కే. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ జట్టు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
"అంతా భిన్నంగా ఉంది. ఇది మ్యాచ్ అనంతరం కార్యక్రమంలా అనిపించట్లేదు. చాలా సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగినా మేం ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో అర్థం చేసుకోవడానికి మేం కాస్త సమయం తీసుకున్నాం. ముంబయి బ్యాట్స్‌మెన్ బాగా ఆడి మాపై ఒత్తిడి తీసుకురాగలిగారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. మాలో ఎక్కువమంది రిటైరైన వాళ్లే. అయినప్పటికీ వాళ్ల అనుభవం జట్టుకు, యువ ఆటగాళ్లకు పనికొస్తుంది."
- మహేంద్రసింగ్ ధోనీ, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్
శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై విజయంతో ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకున్నాడు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.
-
Thala 100* wins in #yellove! 🦁💛#NoPerumaiOnlyKadamai#WhistleFromHome #WhistlePodu #MIvCSK pic.twitter.com/yS1Q00i5KH
— Chennai Super Kings (@ChennaiIPL) September 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thala 100* wins in #yellove! 🦁💛#NoPerumaiOnlyKadamai#WhistleFromHome #WhistlePodu #MIvCSK pic.twitter.com/yS1Q00i5KH
— Chennai Super Kings (@ChennaiIPL) September 19, 2020Thala 100* wins in #yellove! 🦁💛#NoPerumaiOnlyKadamai#WhistleFromHome #WhistlePodu #MIvCSK pic.twitter.com/yS1Q00i5KH
— Chennai Super Kings (@ChennaiIPL) September 19, 2020
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్‌లలో రాణిస్తామని తెలిపాడు. డుప్లెసిస్, రాయుడులా తమ బ్యాట్స్‌మెన్ ప్రదర్శన చేయలేదని వెల్లడించాడు. "డుప్లెసిస్, రాయుడు లాగా మా బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆడలేదు. మొదటి 10 ఓవర్లలో మేం 85 పరుగులు చేశాం. చివర్లో సీఎస్కే బౌలర్లు ఎంతో చక్కగా బౌలింగ్ చేశారు. టోర్నీ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ మ్యాచ్‌లో మేం చేసిన తప్పులను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్‌లో తెలివిగా రాణిస్తాం. పిచ్‌లకు అనుగుణంగా మా జట్టులో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు రోహిత్ శర్మ.