ETV Bharat / sports

ఆర్సీబీపై విజయం.. ప్లే ఆఫ్స్​కు ముంబయి - ముంబయి vs బెంగళూరు స్క్వాడ్ అప్డేట్స్

Mumbai won the toss and elected to bat first
టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
author img

By

Published : Oct 28, 2020, 7:02 PM IST

Updated : Oct 28, 2020, 11:06 PM IST

22:56 October 28

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ​ బెంగళూరు జట్టుపై ముంబయి ఇండియన్స్ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి.. 19.1ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో సూర్యకుమార్​ యాదవ్​​(74) మెరుపు ఇన్నింగ్స్​, బౌలర్​ బుమ్రా (3) వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. ఇషాన్​ కిషన్​(25) పర్వాలేదనిపించాడు. మిగతా వారు విఫలమయ్యారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్​ బెర్త్​  ఖాయం చేసుకున్న తొలి జట్టుగా రోహిత్​ సేన నిలిచింది. ఆర్సీబీ బౌలర్లో సిరాజ్​(2) చాహల్(2)​, క్రిస్​ మోరిస్​ ఒక్క వికెట్​ తీశారు.  

22:51 October 28

గెలుపు దిశగా ముంబయి

బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ గెలుపునకు దగ్గరైంది. ప్రస్తుతం 18.5 ఓవర్లకు 158 పరుగులు చేసింది. గెలవాలంటే 7 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉంది. 

22:38 October 28

16 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది ముంబయి. ఈ ఓవర్లో పదమూడు పరుగులు వచ్చాయి. క్రీజులో సూర్యకుమార్​ యాదవ్​ నిలకడగా ఆడుతుండగా.. హార్దిక్​ పాండ్య(8) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. 

22:28 October 28

15 ఓవర్లో  ముంబయికు పది పరుగులు వచ్చాయి. దీంతో 15 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. 

22:17 October 28

12.2 ఓవర్లకు ముంబయి 91 పరుగులు చేసింది. 46 బంతుల్లో 76 పరుగులు అవసరం.  క్రీజులో సూర్యకుమార్​ యాదవ్​, కృనాల్​ పాండ్య జాగ్రత్తగా ఆడుతోన్నారు. 

21:49 October 28

ముంబయి జోరుకు బ్రేక్​

లక్ష్యఛేదనలో బ్యాటింగ్​ను జోరుగా ప్రారంభించిన ముంబయి ఇండియన్స్​ తొలి వికెట్​ కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్​ మహ్మద్​ సిరాజ్​ బౌలింగ్​లో క్వింటన్​ డికాక్​(18) వెనుదిరిగాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యాక వికెట్​ కోల్పోయిన రోహిత్​ సేన 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఇషాన్​ కిషన్​ (23), సూర్య కుమార్​ యాదవ్​ (3)లు ఉన్నారు. 

21:27 October 28

నిలకడగా ముంబయి బ్యాటింగ్

165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్​ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు డికాక్ (4), ఇషాన్ కిషన్ (11) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు ఓవర్లకు 15 పరుగులు చేసింది.

21:04 October 28

ముంబయి లక్ష్యం 165

ముంబయి ఇండియన్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఫిలిప్ 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారిలో కోహ్లీ (9), డివిలియర్స్ (15),  దూబే (2), మోరిస్ (4) విఫలమయ్యారు. చివర్లో సుందర్ (10), మన్ (12) నాటౌట్​గా నిలిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో రాణించగా.. రాహుల్ చాహర్, పొలార్డ్, బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

20:53 October 28

తడబడుతోన్న బెంగళూరు బ్యాట్స్​మెన్

ప్రారంభంలో దూకుడుగా కనిపించిన బెంగళూరు చివర్లో తడుబడుతోంది. డివిలియర్స్ (15), దూబే (2), మోరిస్ (4), పడిక్కల్ (74) వెనువెంటనే పెవిలియన్​కు క్యూ కట్టారు. దీంతో 7 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ప్రస్తుతానికి 18 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

20:36 October 28

జోరుమీద బెంగళూరు

బ్యాటింగ్​లో బెంగళూరు దూకుడు కొనసాగిస్తోంది. కోహ్లీ 9 పరుగులే చేసి విఫలమైనా.. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 73 పరుగులతో రెచ్చిపోయి ఆడుతున్నాడు. డివిలియర్స్ (13) ఇతడికి మద్దతిస్తున్నాడు.  

20:15 October 28

పడిక్కల్ హాఫ్ సెంచరీ

ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన బెంగళూరు మెల్లమెల్లగా జోరు పెంచుతోంది. ఓపెనర్లు ఫిలిప్, పడిక్కల్ తొలి వికెట్​కు 71 పరుగులు జోడించారు. అనంతరం ఫిలిప్ 33 పరుగులు చేసి రాహుల్ చాహర్  బౌలింగ్​లో ఔటయ్యాడు. మరో యువ ఆటగాడు పడిక్కల్ హాఫ్ సెంచరీ (53)తో క్రీజులో ఉన్నాడు. ఇతడికి తోడుగా కోహ్లీ (7) బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం 11 ఓవర్లకు 93 పరుగులు చేసింది ఆర్సీబీ.

20:00 October 28

దూకుడుగా బెంగళూరు

బెంగళూరు బ్యాటింగ్​లో జోరు పెంచింది. ఓపెనర్లు ఫిలిప్, పడిక్కల్ దూకుడుగా ఆడుతున్నారు. దీంతో ఆరు ఓవర్లకు 54 పరుగులు చేసింది ఆర్సీబీ,

19:35 October 28

నెమ్మదిగా బెంగళూరు బ్యాటింగ్

ముంబయి ఇండియన్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న బెంగళూరు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఓవర్లలో 10 పరుగులు చేసింది. ఫిలిప్ (6), పడిక్కల్ (4) ఆచితూచి ఆడుతున్నారు.

19:08 October 28

జట్లు

బెంగళూరు

దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్ మన్, శివం దూబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డెయిల్ స్టెయిన్, మహ్మద్ సిరాజ్, చాహల్

ముంబయి

ఇషాన్ కిషన్, డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

18:41 October 28

టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

అబుదాబి వేదికగా నేడు జరిగే మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచిన వారికి ప్లే ఆఫ్స్​ బెర్తు​ ఖాయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోహిత్​ సేన అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ సేన మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​కూ రోహిత్ దూరమయ్యాడు.

Last Updated : Oct 28, 2020, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.