ETV Bharat / sports

ఆ ఓవర్లలో ముంబయి బాగా ఆడింది: కోహ్లి - కోహ్లి తాజా వార్తలు

అబుదాబి వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​తో తలపడిన ముంబయి ఇండియన్స్​ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌​ బెర్తును ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. సూర్యకుమార్​ యాదవ్​ తన మెరుపు ఇన్నింగ్స్​తో జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. మరో వైపు తమ బౌలర్లు ఈ మ్యాచ్​లో చక్కగా రాణించారని అంటున్నాడు బెంగళూరు సారథి కోహ్లీ.

Mumbai bowled in right areas in last 5, we were 20 runs short: Kohli
ఆ ఐదు ఓవర్లలో బెంగళూరు బాగా ఆడింది: కోహ్లి
author img

By

Published : Oct 29, 2020, 5:02 AM IST

అబుదాబి వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్​లో ​ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టింది ముంబయి ఇండియన్స్. బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఐపీఎల్​లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం అంటున్నాడు బెంగళూరు జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లి. తమ బౌలర్లు చక్కని ప్రదర్శన చేశారని అన్నాడు. కానీ.. చివరి 5 ఓవర్లలో ముంబయి తమను కట్టడి చేసిందని చెప్పాడు.

"మా జట్టుకు చివరి 5 ఓవర్లు చాలా క్లిష్టమైనవి. అంతా ఫీల్డర్ల అధీనంలోకి వెళ్లిపోయింది. ముంబయి జట్టు చక్కగా బౌలింగ్​ చేసి చివరి 5 ఓవర్లలో 20 పరుగులకే మమ్మల్ని కట్టిడి చేశారు. మా బౌలర్లు చక్కగా రాణించారు. ముంబయి జట్టు బ్యాట్స్​మెన్​ బాగా ఆడారు. ప్రారంభంలో కొన్ని జట్లు అదరగొడతాయి. మరికొన్ని జట్లు తర్వాత బాగా ఆడుతాయి. ఐపీఎల్​లో ఏ జట్టు అద్భుతంగా రాణిస్తుందో, ఏది వెనుకబడిపోతుందో అంచనా వేయలేం."

--- విరాట్​ కోహ్లీ, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​.

'ఫినిషింగ్​ చేస్తా'

74 పరుగులతో సూర్యకుమార్​ యాదవ్​ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా నిలిచాడు. తనకు ఫినిషింగ్​ చేయడం అంటేనే ఇష్టం అంటున్నాడు సూర్యకుమార్​. లాక్​డౌన్​ కాలంలో తన ఆటతీరుపై అవగాహనకు వచ్చినట్లు చెప్పాడు.

"నేను ఆటను ఫినిషింగ్​ చేయాలని అనుకుంటున్నాను. ధ్యానం చేయడం నాకు చాలా సాయపడింది. లాక్​డౌన్​ కాలంలో నా ఆటతీరును తెలుసుకున్నాను. తగినట్టుగా మెరుగుపరుచుకున్నాను. ఈ మ్యాచును ముగించడం సంతోషంగా ఉంది."

-- సూర్యకుమార్​ యాదవ్​. ముంబయి జట్టు ఆటగాడు. (మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​)

'సూర్య అండగా నిలిచాడు'

రోహిత్​ గాయంతో ఆటకు దూరమవగా.. ముంబయి జట్టు సారథ్య బాధ్యతను మరోసారి కీరన్​ పొలార్డ్​ చేపట్టాడు. తమ విజయంపై ఆనందాన్ని పంచుకున్నాడు.

"బుమ్రా ఒక్కడిపైనే ఆధారపడకుండా.. సమష్టి కృషి చేయాలనుకుంటున్నాం. మేము కొన్ని వికెట్లు కోల్పోయాము. కానీ, సూర్య కుమార్​ మాకు అండగా నిలిచాడు. ఆ స్థానంలో మరొకరు వస్తే ఎలా ఉండేదో ఊహించండి. అతను చేయాల్సినదాన్ని అద్భుతంగా కొనసాగించాడు."

-- కీరన్​ పొలార్డ్​, ముంబయి ఇండియన్స్​.

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ముంబయి.. 19.1ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చూడండి:'సూర్య' ప్రతాపం.. ప్లేఆఫ్స్​కు చేరిన ముంబయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.