ఐపీఎల్ చరిత్రలో ఈసారి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎదురైన అనుభవాలు, గతంలో ఎప్పుడూ రాలేదేమో బహుశా! టోర్నీలో ప్రతిసారి లీగ్ దశ దాటిన సీఎస్కే.. ఈసారి తమ అభిమానుల్ని నిరాశ పరుస్తోంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన, తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకునేవాడు. కానీ, ఈ సీజన్లో అతడు ప్రదర్శన కలవరపరుస్తోంది. దీనితో పాటే పాయింట్ల పట్టికలో సీఎస్కే చివరి స్థానంలో నిలిచింది.
దిల్లీ, హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకగా.. చెన్నై చివరి స్థానానికి పడిపోయిది. పట్టికలో సీఎస్కే చివరిస్థానంలో నిలవడం ఇదే తొలిసారి!
ఆరంభం బాగుంది.. కానీ
ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ధోనీసేన మూడు మ్యాచ్‌లు ఆడింది. ముంబయిపై తొలి మ్యాచ్ గెలవగా.. మిగిలిన రెండింటిలోనూ(దిల్లీ, రాజస్థాన్) ఓడిపోయింది.
తక్కువ రన్‌రేట్
పట్టికలో చెన్నై సూపర్‌కింగ్స్(-0.840) కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(-1.450) అత్యంత తక్కువ రన్‌రేట్‌తో ఉంది. కానీ పాయింట్లు ఉండటం వల్ల మూడో స్థానం సొంతం చేసుకుంది. తన తర్వాతి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అక్టోబరు 2న ఆడనుంది చెన్నై జట్టు.