ETV Bharat / sports

'మహీ అలా చేస్తే వచ్చే ఐపీఎల్​లో రాణించవచ్చు' - ధోనీపై గావస్కర్​ ప్రశంసలు

చెన్నై జట్టు సారథి ధోనీ.. దేశవాళీ క్రికెట్​లో ఆడాలని సూచించాడు భారత దిగ్గజ బ్యాట్స్​మన్​ సునీల్​ గావస్కర్​. దీంతో మహీ మళ్లీ ఫామ్​లోకి వచ్చే అవకాశముందని చెప్పాడు. తద్వారా వచ్చే ఐపీఎల్​లో 400 పరుగులు చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

MS Dhoni
ధోనీ
author img

By

Published : Nov 2, 2020, 9:13 AM IST

చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి ధోనీని ప్రశంసించాడు భారత దిగ్గజ బ్యాట్స్​మన్​ సునీల్​ గావస్కర్​. అతనో గొప్ప క్రికెటర్​, తన బ్యాటింగ్​, వికెట్​ కీపింగ్, నాయకత్వ లక్షణాలు అద్భుతమని కొనియాడాడు. మహీ దేశవాళీ క్రికెట్​ ఆడాలని సూచించాడు. దీంతో ఫిట్​నెస్​ పెరిగి వచ్చే ఐపీఎల్​లో మరింత పుంజుకునే అవకాశముందని అన్నాడు.

"ధోనీ అద్భుతమైన ఆటగాడు. అతడు ఉండే విధానం నాకు చాలా నచ్చుతుంది. తన ఆటను నేను బాగా ఎంజాయ్​ చేశాను. ఇకపై మహీ దేశవాళీ క్రికెట్​లో ఆడితే బాగుంటుంది. తద్వారా మళ్లీ ఫామ్​లోకి రావొచ్చు. వచ్చే ఐపీఎల్​లో 400 పరుగులు చేసే సామర్థ్యం పొందుతాడు."

-గావస్కర్​, భారత దిగ్గజ క్రికెటర్​.

వచ్చే ఏడాది ప్రారంభం నుంచి దేశవాళీ క్రికెట్​ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇటీవల ప్రకటించాడు.

ఇదీ చూడండి హామిల్టన్​ ఖాతాలో మరో విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.