ETV Bharat / sports

'ధోనీతో కలిసి ఆడటం నాకు దక్కిన అదృష్టం' - రుతురాజ్​ గైక్వాడ్​ ధోనీ వార్తలు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోనీతో కలిసి ఆడటం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు యువ క్రికెటర్​ రుతురాజ్​ గైక్వాడ్​ వెల్లడించాడు. ఐపీఎల్​ గ్రూప్​ దశ ముగిసిన క్రమంలో సీఎస్కేతో తన ప్రయాణం గురించి ఇన్​స్టాగ్రామ్​లో గైక్వాడ్​ పోస్ట్​ పెట్టాడు.

More than a dream to share 22 yards with MS Dhoni, says Gaikwad
'ధోనీతో కలిసి ఆడటం నాకు దక్కిన అదృష్టం'
author img

By

Published : Nov 4, 2020, 9:01 PM IST

కెప్టెన్​ ధోనీతో 22 గజాల క్రికెట్ మైదానాన్ని పంచుకోవడం తాను కన్న కల కంటే ఎక్కువని చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​ అంటున్నాడు. ప్రసుత ఐపీఎల్​ సీజన్​ ముగిసిన క్రమంలో ధోనీని ఉద్దేశించి ఇన్​స్టాగ్రామ్​లో రుతురాజ్​ ఓ పోస్ట్​ పెట్టాడు.

"2016 అక్టోబరులో నా తొలి రంజీ మ్యాచ్​ సందర్భంగా ధోనీని మొదటిసారిగా కలిశాను. అతడు ఝార్ఖండ్​కు గురువు. 'ఎలా ఉన్నావు' అని అడిగాడు. అదే నెల (అక్టోబరు) 2020లో స్వయంగా వచ్చి నాతో మాట్లాడాడు. డ్రెస్సింగ్​ రూమ్​ను ధోనీతో కలిసి పంచుకోవడం నాకు దక్కిన అదృష్టం. 22 గజాలను అతనితో పంచుకోవడం చాలా బాగుంది. నేను కన్న కల కంటే చాలా గొప్పగా జరిగింది".

- రుతురాజ్​ గైక్వాడ్​, చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో ఆరు మ్యాచ్​లకు సీఎస్కే తరపున ప్రాతినిధ్యం వహించిన రుతురాజ్​.. 51 సగటుతో 204 పరుగులు చేశాడు. వరుసగా మూడు హాఫ్​సెంచరీలు నమోదు చేసిన తొలి సీఎస్కే బ్యాట్స్​మన్​గా నిలిచాడు. మరోవైపు 'రుతురాజ్​ యంగ్​ విరాట్​ కోహ్లీని తలపిస్తున్నాడని' ఫాఫ్​ డుప్లెసిస్​ కొనియాడాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.