కింగ్స్ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్లు డుప్లెసిస్, వాట్సన్ బ్యాటింగ్ అదరగొడుతున్న సమయంలో.. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఒకవేళ చెన్నై ఒక్క వికెట్ కూడా పడకుండా మ్యాచ్ గెలిస్తే.. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చలు ఉండవు. కాదంటారా? అని సునీల్ గావస్కర్ స్టీఫెన్‌ను అడిగాడు. దీనిపై స్పందించి స్టీఫెన్.. "మహీ ఇకపై ఓపెనర్‌గా దిగాలేమో. మీడియా ముందు చెప్పమన్నా నేను రెడీ. అయితే, ఇప్పుడు మీ ముందు మాట్లాడటం సరైనదేనని అనిపిస్తోంది" అంటూ సరదాగా చెప్పాడు.
మరోవైపు సామ్ కరన్ లాంటి యువ ఆటగాళ్లపై ఎలా అంచనాకు వస్తారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా అడగ్గా.. 'మా జట్టులో ఉండేదే యువకులు. వారే మాకు బలం.' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.