ETV Bharat / sports

పంజాబ్​ వరుస విజయాలు.. రహస్యం అదే! - gawaskar kl rahul

పంజాబ్​ వరుస విజయాల వెనుక కేఎల్​ రాహుల్​ కెప్టెన్సీ, కోచ్​ కుంబ్లే పోరాడేతత్వమే ఉందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.

Kings XI
పంజాబ్​
author img

By

Published : Oct 26, 2020, 6:30 PM IST

Updated : Oct 26, 2020, 6:40 PM IST

ఈ ఐపీఎల్​ సీజన్​లోని ప్రారంభ మ్యాచుల్లో వరుసగా ఓడినా.. రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​. ఓటమి తప్పదనుకున్న మ్యాచుల్లోనూ బాగా పోరాడి, విజయాలను సాధించింది. అయితే ఇదంతా కేఎల్​ రాహుల్​ సారథ్యం, కోచ్​ అనిల్​ కుంబ్లే పోరాడేతత్వం వల్లే జరిగిందని దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్ అభిప్రాయపడ్డాడు​.

"గెలిచే దారిని పంజాబ్​ కనుక్కుంది. లీగ్​ ఆరంభంలో గెలవలేకపోయింది. ప్రతిసారి విజయానికి చేరువగా వచ్చి ఓడింది. కానీ గత కొన్ని మ్యాచుల నుంచి అద్భుతంగా ఆడుతోంది. సన్‌రైజర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులే చేసినా సరే 12 పరుగుల తేడాతో విజయం సాధించడం సంచలనం. పంజాబ్ ఆటగాళ్లు తమను తాము బలంగా నమ్మారు. జట్టును రాహుల్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా బాగా ఎదిగాడు. ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలింగ్ మార్పు విషయాలలో అతడు రాటుదేలాడు. ముఖ్యంగా కోచ్ కుంబ్లే పాత్రను మరవకూడదు. క్రికెట్ కెరీర్ మొత్తం అతడు పోరాడుతూనే ఉన్నాడు. దెబ్బతగిలినా మ్యాచులు ఆడి పంజాబ్​ జట్టులో స్ఫూర్తిని నింపాడు. క్లిష్ట పరిస్థితుల్లో పంజాబ్ పుంజుకుని.. ప్లేఆఫ్స్ రేసులోనూ నిలిచిందంటే అది వీరిద్దరి వల్లే"

-గావస్కర్, భారత దిగ్గజ క్రికెటర్​.

తన తర్వాతి మ్యాచ్​లో భాగంగా సోమవారం(అక్టోబరు 26), కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడనుంది. ఇందులో గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.

ఇదీ చూడండి 'స్టోక్స్​, శాంసన్ ఇన్నింగ్స్ అద్భుతం'

Last Updated : Oct 26, 2020, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.