కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. షార్జా వేదికగా జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఎనిమిది వికెట్లు తేడాతో గెలుపొందింది. 150 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్.. ఏడు బంతులు మిగిలి ఉండగానే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో మన్దీప్ సింగ్(66), గేల్(51) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఒక్క వికెట్ తీశాడు.
కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం - ipl 2020 news
22:49 October 26
22:42 October 26
17వ ఓవర్లో పదమూడు పంజాబ్‌కు 13 పరుగులు వచ్చాయి. ఇప్పటివరకు వికెట్ నష్టానికి 136పరుగులు చేసింది. 17 బంతుల్లో 15 అవసరం.
22:29 October 26
పదిహేను ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్.. వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో గేల్(45), మనదీప్(38) ఆచితూచి ఆడుతోన్నారు. 30 బంతుల్లో 37 పరుగులు అవసరం.
22:22 October 26
పదమూడో ఓవర్లో పంజాబ్‌కు పది పరుగులు వచ్చాయి. గేల్(34) సిక్సర్లతో రెచ్చిపోతుండగా.. మన్దీప్(34) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. మొత్తంగా 13 ఓవర్లకు వికెట్ నష్టానికి 97పరుగులు చేసింది.
22:20 October 26
క్రీజులో జాగ్రత్తగా ఆడుతోన్న మన్దీప్ సింగ్(33) పంజాబ్ తరఫున వెయ్యి పరుగులు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
22:09 October 26
సిక్సర్లు బాదుతోన్న గేల్
పది ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో మన్దీప్ సింగ్(26) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. గేల్(13) వచ్చి రాగానే రెండు సిక్స్‌లతో విజృంభించాడు. 60 బంతుల్లో 83 పరుగులు అవసరం.
22:00 October 26
పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో సారథి కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్రీజులో మన్దీప్ సింగ్(19) నెమ్మదిగా ఆడుతోన్నాడు. దీంతో ఎనిమిది ఓవర్లకు వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.
21:46 October 26
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ వికెట్లు ఏమీ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. క్రీజులో మన్దీప్ సింగ్(16), కేఎల్ రాహుల్(18) జాగ్రత్తగా ఆడుతోన్నారు.
21:12 October 26
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసి ఆల్ఔట్ అయింది. శుభమన్ గిల్(57) టాప్ స్కోరర్. సారథి మోర్గాన్(40) పర్వాలేదనిపించాడు. మిగతా వారు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(3), రవి బిష్ణోయ్(2), జోర్డాన్(2), అశ్విన్,మ్యాక్స్వెన్ తలో వికెట్ తీశారు.
21:04 October 26
షమీ బౌలింగ్‌లో నిలకడగా ఆడిన గిల్(57) షాట్‌కు యత్నించి పూరన్ చేతికి చిక్కాడు. దీంతో 19 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది కోల్‌కతా.
20:47 October 26
పంజాబ్ బౌలర్లు పట్టుబిగుస్తున్నారు. దీంతో కోల్‌కతా 16 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్రీజులో ఫెర్గుసన్ ఇప్పుడే రాగా, గిల్(51) నిలకడగా ఆడుతోన్నాడు.
20:31 October 26
11 ఓవర్లకు కోల్‌కతా ఐదు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. జోర్డాన్ మరోసారి చక్కని బౌలింగ్ ప్రతిభ కనబరిచాడు. 9 పరుగులిచ్చి నరైన్ (6)ను ఔట్ చేశాడు. గిల్ (45) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు.
20:25 October 26
కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయింది. రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో మోర్గాన్ (40) షాట్‌కు యత్నించి అశ్విన్ చేతికి చిక్కాడు. దీంతో 10.2 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.
20:14 October 26
వీర బాదుడు...
మోర్గాన్, గిల్ జోడీ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తోంది. ఓవర్‌కు రెండు బౌండరీల చొప్పున బాదేస్తున్నారు. 8 ఓవర్లకు జట్టు స్కోరు 80 పరుగులు దాటింది.
19:53 October 26
పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది కోల్‌కతా. క్రీజులో మోర్గాన్(11), శుభమన్ గిల్(14) జాగ్రత్తగా ఆడుతోన్నారు.
19:47 October 26
మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 18 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో శుభమన్ గిల్, మోర్గాన్ ఉన్నారు.
18:51 October 26
ఎవరు గెలుస్తారో?
షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగనుంది కోల్‌కతా. పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు(కోల్‌కతా), ఐదు(పంజాబ్) స్థానాల్లో ఈ జట్టు.. మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం. మరి ఏమవుతుందో చూడాలి.
జట్లు
కోల్‌కతా: శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్, మోర్గాన్(కెప్టెన్), నరైన్, కమిన్స్, ఫెర్గూసన్, కమలేశ్ నాగర్కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్దీప్ సింగ్, గేల్, పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమి, అర్షదీప్ సింగ్