ETV Bharat / sports

చేజేతులా విజయం చేజార్చుకున్న చెన్నై - సీఎస్కే స్క్వాడ్ టుడే

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ పరాజయం పాలైంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ధోనీసేన 10 పరుగుల తేడాతో ఓడింది.

KKR vs CSK: Kolkata Knight Riders beat Chennai Super Kings by 10 runs
చెన్నై సూపర్​కింగ్స్​పై కోల్​కతా ఘనవిజయం
author img

By

Published : Oct 8, 2020, 12:06 AM IST

ఐపీఎల్​లో చెన్నైని మరో పరాజయం పలకరించింది. గత మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టుకు కోల్‌కతా చేతిలో ఓటమి పాలైంది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది ధోనీసేన. 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (50; 40 బంతుల్లో 6×4, 1×6), అంబటి రాయుడు (30; 27 బంతుల్లో 3×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. అంతకు ముందు కోల్‌కతాలో రాహుల్‌ త్రిపాఠి (81; 51 బంతుల్లో 8×4, 3×6) అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా విఫలమయ్యారు.

ఛేదనలో చెన్నైకి శుభారంభమే లభించింది. డుప్లెసిస్ (17).. శివమ్‌ మావి వేసిన 3.4వ బంతికే ఔటైనా షేన్‌ వాట్సన్‌ దూకుడుగా ఆడాడు. అంబటి రాయుడు (30; 27 బంతుల్లో)తో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ వరుసగా షాట్లు బాదడం.. 12వ ఓవర్‌ ముగిసినా మరో వికెట్‌ పడకపోవడం వల్ల డీకే సేన బెంబేలెత్తిపోయింది. చెన్నై విజయంపై ఎవరికీ అనుమానాలు కలగలేదు. అయితే 12.1వ బంతికి నాగర్‌కోటి.. రాయుడిని పెవిలియన్‌ చేర్చిన మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

అర్ధశతకం చేసిన వెంటనే వాట్సన్‌ను నరైన్‌ ఎల్బీగా ఔట్​ చేశాడు. జట్టు స్కోరు 129 వద్ద యంఎస్‌ ధోనీ (11; 12 బంతుల్లో 1×4)ను చక్రవర్తి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దాంతో చెన్నైకు వరుస షాకులు తగిలాయి. సామ్‌ కరన్‌ (17; 11 బంతుల్లో 1×4, 1×6)ను రసెల్‌ ఔట్‌ చేయడం వల్ల ఇక ఓటమి ఖాయమైంది. చివరి రెండు ఓవర్లలో ఒకటి, రెండు బౌండరీలు బాదినా అవి ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడ్డాయి. చివరికి ధోనీసేన 5 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లు తొలి 10 ఓవర్లలో ధారాలంగా పరుగులిచ్చినా చివరి 10 ఓవర్లలో అద్భుతంగా పుంజుకుని విజయం సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.