ETV Bharat / sports

'హార్దిక్​, పొలార్డ్​ నుంచి ఆ ట్రిక్స్​ తెలుసుకున్నా' - ఇషాన్​ కిషన్​ గేమ్​ ట్రిక్స్​

ఆటకు సంబంధించిన మెలకువలన్నీ కీరన్​ పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా నుంచి నేర్చుకుంటున్నట్లు తెలిపాడు ముంబయి ఇండియన్స్​ ఆటగాడు ఇషాన్ కిషన్​. తనలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు బాగా ప్రాక్టీసు చేస్తునట్లు వెల్లడించాడు.

ishan
ఇషాన్​ కిషన్​
author img

By

Published : Oct 3, 2020, 6:00 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ సూపర్ ఓవర్​ వరకు వెళ్లడానికి ఇషాన్​ కిషన్​(99) పాత్ర కీలకం. ఈ మ్యాచ్​ తర్వాత ఇతడిపై ప్రశంసలు జల్లు కురిపించారు మాజీలు, క్రికెట్ పండితులు, అభిమానులు. అయితే ఆటకు సంబంధించిన మెలకువలన్నీ కీరన్​ పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా దగ్గర నుంచి నేర్చుకుంటున్నట్లు తెలిపాడు కిషన్.

"నేను వారిద్దరితో మూడేళ్లుగా కలిసి ఆడుతున్నా. ఆటకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించాలో వారికి బాగా తెలుసు. కేవలం పవర్​ హిట్టింగ్​ గురించి మాత్రమే కాదు.. ఓ మ్యాచ్​ను చివరి ఓవర్​ వరకు ఎలా తీసుకెళ్లాలి, బౌలర్లపై ఒత్తిడి ఎలా పెంచాలి వంటి విషయాలను నేర్చుకున్నా. అలానే స్ట్రైక్ రొటేట్​, మనం తర్వాతి చర్యను ఏమి తీసుకోబోతున్నాం అనేది ప్రత్యర్థి ఆటగాడికి తెలియనీయకుండా ఎలా తికమక పెట్టాలి వంటి అంశాలను వారి నుంచి గ్రహించా."

-ఇషాన్​ కిషన్​, ముంబయి ఇండియన్స్​ ఆటగాడు.

ముంబయి ఇండియన్స్​ తన తర్వాతి మ్యాచ్​లో షార్జా వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడనుంది. అయితే ఈ మైదానంలోని పిచ్ బ్యాట్స్​మెన్​కు లాభదాయకమని చెప్పాడు ఇషాన్​. తనలోని లోపాలను సరిదిద్దుకోవటానికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆటలో ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.

ఇదీ చూడండి రాజస్థాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.