ETV Bharat / sports

దిల్లీ vs హైదరాబాద్: ఫైనల్​కు వెళ్లేది ఎవరు?

author img

By

Published : Nov 8, 2020, 5:31 AM IST

క్వాలిఫయర్-2లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్​​లో ముంబయితో తలపడుతుంది.

Delhi Capitals
దిల్లీxసన్​రైజర్స్​

ఐపీఎల్​ కప్పు కోసం ఫైనల్​ల్లో అడుగుపెట్టే జట్టేదో మరికొద్ది గంటల్లో తెలిసిపోనుంది. క్వాలిఫయర్​1లో ఓడిన దిల్లీ.. ఎలినినేటర్​లో గెలిచిన హైదరాబాద్​ మధ్య అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. మరి ఎవరు గెలుస్తారో?

ఏమో కష్టమే

లీగ్​ రెండో అర్ధ భాగంలో దిల్లీ క్యాపిటల్స్​ అస్థిర ప్రదర్శన కనబరుస్తూ అభిమానులను నిరాశ పరుస్తోంది. ప్లేఆఫ్స్​లోని క్వాలిఫయర్​1​లో ముంబయి ఇండియన్స్​ చేతిలో ఘోరంగా ఓడిపోయింది​. స్టోయినిస్​(65), అక్షర్ పటేల్​(42), అశ్విన్​ 3 వికెట్లు తీయడం మినహా అందరూ విఫలమయ్యారు.

టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్ శిఖర్​ ధావన్​(525), పృథ్వీ షా(228), అజింక్య రహానె(111) ఇప్పటికైనా సరే ఫామ్​లోకి రావాలి. బౌలర్లలో రబాడ(25), అన్రిచ్​(20), అశ్విన్​(13) బాగానే రాణిస్తున్నారు. మొత్తంగా జట్టు ఈ మ్యాచ్​లో సమష్టిగా రాణిస్తేనే ఫైనల్​కు చేరుతుంది. లేదంటే కష్టమే.

దూకుడు మీదున్న వార్నర్​సేన

హైదరాబాద్ జట్టు​ సీజన్​ రెండో అర్ధభాగంలో దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్​లో ఉంది. వార్నర్​,​ సాహా ఓపెనింగ్​ వచ్చి అదరగొడుతున్నారు. అయితే ఎలిమినేటర్​ మ్యాచ్​లో వార్నర్​ కొంచెం డీలా పడ్డాడు. గాయం కారణంగా సాహా ఆడలేకపోయాడు. క్వాలిఫయర్​-2లో అతడు బరిలో దిగే అవకాశముంది. బెయిర్​ స్టో, మనీశ్​ పాండే బాగా ఆడుతున్నారు. ఆల్​రౌండర్​ జేసన్​ హోల్డర్​ బ్యాట్​, బంతితో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు.

బౌలింగ్ విభాగం కూడా అదరగొడుతోంది. పవర్​ప్లేలో సందీప్​ శర్మ, మిడిల్​ ఓవర్లలో హోల్డర్​, షబాజ్​ నదీమ్​, రషీద్​ ఖాన్.. డెత్​ ఓవర్లలో యార్కర్ల స్పెషలిస్ట్​ టి.నటరాజన్ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్స్​కు చెమటలు పట్టిస్తున్నారు. ఇదే ఫామ్​ను కొనసాగిస్తే ఫైనల్​లో అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.

జట్లు (అంచనా)

హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్​), వృద్దిమాన్ సాహా (వికెట్​ కీపర్​), మనీశ్​ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

దిల్లీ క్యాపిటల్స్​ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్​), రిషబ్ పంత్ (వికెట్​ కీపర్​), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, అశ్విన్, రబాడ, అన్రిచ్

ఇదీ చూడండి: వార్నర్​ సేన అదరహో.. బెంగళూరు ఇంటికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.