ETV Bharat / sports

దిల్లీ X పంజాబ్​ : రెండో మ్యాచ్​లో పైచేయి ఎవరిది? - దల్లీ vs పంజాబ్ ఐపీఎల్ 2020

దుబాయ్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆదివారం తలపడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్ల బలాలుబలహీనతలపై ప్రత్యేక కథనం.

Delhi Capitals face KXIP
దిల్లీ X పంజాబ్​
author img

By

Published : Sep 20, 2020, 5:35 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​లో పేలవ రికార్డు కోసం పోటీ పడుతున్నట్టు ఉంటాయి ఆ జట్లు. ఇప్పటివరకూ జరిగిన 12 సీజన్లను పరిశీలిస్తే తక్కువసార్లు ప్లే-ఆఫ్స్‌కు చేరిన వాటిలో ఆ జట్లే కింద నుంచి రెండు స్థానాల్లో ఉంటాయి. జట్లు మార్చినా, సారథులను మార్చినా, కోచింగ్‌ సిబ్బందిని మార్చినా అవి మాత్రం నిలకడైన ప్రదర్శన చేయలేకపోతున్నాయి. అవే దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌. ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి. మరి ఈ సీజన్‌లోనైనా ప్రదర్శన మెరుగుపర్చుకుని టాప్‌-4లోకి అడుగుపెడతాయా?

ఎవరిది పైచేయి?

గతేడాది వీరు ఐదు మ్యాచుల్లో తలపడగా.. నాలుగింటిలో పంజాబ్​దే పైచేయి. చివరి మ్యాచులో మాత్రం దిల్లీ గెలిచింది. ఈ సీజన్​లో బలమైన బ్యాటింగ్​ లైన​ప్​, స్పిన్​ దళంతో పంజాబ్​తో ఉంది. ఈ సారైనా ప్రత్యర్థిపై దిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా? పంజాబ్​ తన విజయాల పరంపరను కొనసాగిస్తుందా? ఎవరు నెగ్గుతారో? అనేది చూడాలి.

దిల్లీ క్యాపిటల్స్ బలాలు

దిల్లీ క్యాపిటల్స్.. ఇప్పటివరకు ఐపీఎల్​ టైటిల్​ ఒక్కసారైనా గెలవలేదు. ప్రతి సీజన్​లోనూ పాయింట్ల పట్టికలో చివరి నాలుగు స్థానాల్లో ఉండే ఈ జట్టు.. గతేడాది మాత్రం మంచి ప్రదర్శన చేసింది. 12 సీజన్‌లలో దిల్లీ ఇప్పటివరకూ కేవలం నాలుగుసార్లు మాత్రమే ప్లే-ఆఫ్స్‌కు చేరింది. 2008, 2009 మినహాయిస్తే ఆ తర్వాత ఎప్పుడూ రెండు వరుస సీజన్లలో టాప్‌-4లో నిలిచిన దాఖలాలు లేవు. 2012లో ప్లే-ఆఫ్స్‌కు వెళ్లిన తర్వాత.. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతేడాదే మళ్లీ ఆ దశకు చేరగలిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుత దిల్లీ జట్టు... ఆశలు రేపేలా కనిపిస్తోంది. దిగ్గజాలు రికీ పాంటింగ్‌, సౌరభ్​ గంగూలీ మార్గదర్శకత్వంలో 2019లో దిల్లీ క్యాపిటల్స్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది సైతం పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.... శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో జట్టులో యువరక్తం ప్రవహిస్తోంది.

shreyas
శ్రేయస్​

ఈ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. గత బిగ్​బాష్ లీగ్​లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ మార్కస్​ స్టోయినిస్​ను ఈసారి వేలంలో దక్కించుకుంది. ఇతడు ఈ జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు. అలాగే మిడిలార్డర్​లో నమ్మదగిన వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​ అలెక్స్​ కారేను తీసుకున్నారు. హెట్​మెయర్ రూపంలో మరో విధ్వంసకర ఆటగాడు జట్టులో చేరాడు.

పృథ్వీ షా, శిఖర్ ధావన్ రూపంలో అదిరిపోయే ఓపెనింగ్ జోడీ కుదిరింది. మూడు, నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించగలడు. అలాగే ఈసారి టాపార్డర్​లో మరింత బలం కోసం ఎంతో అనుభవమున్న అజింక్యా రహానేను తీసుకున్నారు.

అనుభవమున్న రవిచంద్రన్ అశ్విన్ రాకతో స్పిన్ విభాగం పటిష్ఠంగా కనబడుతోంది. ఇతడికి తోడు ఇప్పటికే అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, నేపాల్ యువ స్పిన్నర్ సందీప్ లమిచానే రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న వీరితో యూఏఈలో క్యాపిటల్స్​ సత్తాచాటాలని భావిస్తోంది.

బలహీనతలు

ట్రెంట్ బౌల్ట్​ను ట్రేడ్ ఆప్షన్​లో ముంబయికి అప్పజెప్పిన దిల్లీలో ఈసారి కగిసో రబాడా మాత్రమే చెప్పుకోదగ్గ విదేశీ పేసర్. క్రిస్​ వోక్స్ లాంటి ఆల్​రౌండర్​ను తీసుకున్నా అతడు ఈలీగ్​కు దూరమయ్యాడు. దీంతో ఇతడి స్థానంలో ఎన్రిచ్ నోట్జేను తీసుకున్నారు. కానీ ఇతడికి అంతగా అనుభవం లేదు. డేనియల్ సామ్స్​ రూపంలో అన్​క్యాప్​డ్ ఆస్ట్రేలియా పేసర్ ఉన్నా ఇతడి అవకాశాలు రావడం కష్టమే. అలాగే ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ లాంటి భారత పేసర్లు ఉన్నా వీరి ప్రదర్శనపై పూర్తి నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు క్రీడా పండితులు.

ఆల్​రౌండర్ విభాగంలోనూ ఈ జట్టు పేలవంగా కనిపిస్తోంది. స్టోయినిస్ మాత్రమే ఇందులో చెప్పుకోదగ్గ ఆల్​రౌండర్. మిగతా వారిలో అక్షర్ పటేల్, డేనియల్ సామ్స్, కీమో పాల్, లలిత్ యాదవ్​ ఉన్నారు. వీరంతా అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లోనూ రాణించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

పంజాబ్​ కింగ్స్​ ఎలెవన్​

కింగ్స్​ ఎలెవన్ పంజాబ్.. ఈ జట్టు ఇప్పటివరకు ట్రోఫీని అందుకోలేకపోయింది. గత మూడేళ్లలో వరుసగా 5,6,7 స్థానాల్లో నిలిచిన పంజాబ్ 2014లో మాత్రం ఫైనల్​కు చేరింది. ఈసారి వేలంలో భారీ ఖర్చు పెట్టి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మ్యాక్స్​వెల్, జోర్డాన్, కాట్రెల్ వంటి టీ20 స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంతో జట్టును పటిష్ఠం చేసుకుంది. అయితే ఈ సారి కేఎల్​ రాహుల్​కు జట్టు పగ్గాలు అప్పగించింది. మరి ఇప్పటివరకు టోర్నీలో ఆకట్టుకోని ఈ జట్టు ఈసారైనా అలరిస్తుందేమో చూడాలి.

rahul
రాహుల్​

బలాలు

యువ ఆటగాడు కేఎల్ రాహుల్​కు ప్రధాన బలం రాహులే. కెప్టెన్‌గా, ఓపెనర్‌గా, కీపర్‌గా 3 బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గత 2 సీజన్లతో పాటు జాతీయజట్టు తరఫునా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా ఆడుతుండటం సానుకూలాంశం. గత సీజన్​లో ఈ మెగా లీగ్​ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్ ఈసారి పునరాగమనం చేశాడు. టీ20ల్లో ఇతడికి మంచి రికార్డుంది. దీంతో ఇతడు ఈ జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇతడి చేరికతో బ్యాటింగ్​, బౌలింగ్ విభాగంలో జట్టుకు సమతుల్యం ఏర్పడినట్లు అయింది.

సారథి కేఎల్ రాహుల్, విధ్వంసకర బ్యాట్స్​మన్ క్రిస్ గేల్ రూపంలో ఈ జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ కుదిరింది. గత సీజన్​లో రాహుల్ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్​లో రెండో స్థానంలో నిలిచాడు. 14 మ్యాచ్​ల్లో 53.9 సగటుతో 593 పరుగులు సాధించాడు. గేల్ కూడా 13 మ్యాచ్​ల్లో 153.6 స్ట్రైక్​ రేట్​తో 490 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ గతేడాది జట్టుకు శుభారంభాల్ని అందించారు. అదే ఫామ్​ను ఈసారి కూడా కొనసాగించాలని చూస్తున్నారు.

అప్పర్ మిడిలార్డర్​లో భారత యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, మన్​దీప్ రాణించాలని జట్టు భావిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్ తన క్రియేటిక్ షాట్స్​తో ఎప్పుడూ అలరిస్తుంటాడు. ఈ ముగ్గురి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.

బలహీనతలు

స్పిన్ విభాగంలో ఎంతో అనుభవం కలిగిన రవిచంద్రన్ అశ్విన్​ను వదులుకుంది పంజాబ్. ఇతడు గతేడాది 15 వికెట్లతో రాణించాడు. దీంతో ఈసారి వీరికి అనుభవం కగిలిన స్పిన్నర్ కరవయ్యాడు. మురుగన్ అశ్విన్, ముజిబుర్ రెహ్మన్​లపైనే ఈ జట్టు ఆధారపడాల్సి ఉంది. యూఏఈ లాంటి స్పిన్​ పిచ్​లపై స్పిన్నర్ల కొరత ఉండటం ఈ జట్టుకు పెద్ద బలహీనత.

పేస్​ బౌలింగ్​లో మహ్మద్ షమీ గతేడాది 14 మ్యాచ్​ల్లో 19 వికెట్లతో రాణించాడు. ఇతడికి మద్దతుగా నిలిచి చక్కటి ప్రదర్శన చేసిన సామ్ కురాన్​ను ఈసారి పంజాబ్ వదులుకుంది. ఇతడి స్థానంలో షెల్డన్ కాట్రెల్​ను తీసుకుంది. ​అలాగే స్పిన్నర్ జగదీశ సుచిత్​ను కూడా కొనుగోలు చేసింది. అయినా ఈ జట్టు బౌలింగ్ విభాగంలో అంత పటిష్ఠంగా లేదు. అలాగే ప్రధాన బౌలర్లకు గాయాలైతే బ్యాకప్ ఆప్షన్​ కనిపించడం లేదు.

కప్ప్​ దాహాన్ని తీర్చుకోవడానికి

మొత్తంగా తమ కప్పు దాహాన్ని తీర్చుకోవడంలో భాగంగా... ఈ సీజన్‌ను మంచి విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు వ్యూహరచన సిద్ధం చేసుకున్నాయి. దేశంలో కరోనా విజృంభన కారణంగా ఐపీఎల్​ను యూఏఈకి తరలించారు. మరోవైపు వైరస్​ వ్యాప్తి నియంత్రణ క్రమంలో లీగ్​ మొత్తాన్ని బయోసెక్యూర్​ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే జరపనున్నారు. 53 రోజులపాటు సాగే ఈ లీగ్​.. నవంబరు 10తో ముగియనుంది.

ఇదీ చూడండి చెన్నైX ముంబయి తొలి మ్యాచ్.. పైచేయి ఎవరిది?

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.