వన్డే ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కే ఆ స్థాయిలో ప్రాచుర్యం లభించిందని ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ పొలార్డ్ అన్నాడు. దుబాయ్ వేదికగా మంగళవారం జరగనున్న తుదిపోరులో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుందీ జట్టు. ఈ నేపథ్యంలోనే పొలార్డ్ పై వ్యాఖ్యలు చేశాడు.
"ఫైనల్ అంటేనే ప్రతి ఆటగాడు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఎవరైనా గెలవాలనే కోరుకుంటారు. పొరపాట్లు జరగకుండా ఫైనల్స్ ఆడాలని అనుకుంటున్నాం. ఈ ఫైనల్లో ప్రేక్షకుల ఉండరు. కానీ, దాన్ని ఆస్వాదించాలి. ప్రపంచకప్ తర్వాత అదే స్థాయిలో ప్రాచుర్యం పొందింది ఐపీఎల్ ఫైనల్"
- కిరన్ పొలార్డ్, ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్
ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగుసార్లు (2013, 2015, 2017, 2019) విజేతగా నిలిచింది. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. క్వాలిఫయర్-1లో దిల్లీని ఓడించిన ముంబయి తుదిపోరుకు అర్హత సాధించింది. క్వాలిఫైయిర్-2లోహైదరాబాద్పై గెలిచిన దిల్లీ ఫైనల్లో అడుగుపెట్టింది.
"ఫైనల్ గురించి సుదీర్ఘంగా ఆలోచించడం లేదు. ప్రణాళిక ద్వారా నైపుణ్యాలను అమలు చేయడమే. ఇది బ్యాట్‌కు బంతికి మధ్య పోటీ. పరుగులు, వికెట్లు రాబట్టడమే కావాల్సింది. కాబట్టి మా క్రికెటర్లంతా ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. మా జట్టులో ఎక్కువమందికి ఫైనల్లో ఎలా ఆడాలో తెలుసు" అని ముంబయి కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు.